Google | car | accidents

Google introduced theself driving cars but the car did 11 accidents in six years

Google, car, accidents

Google introduced theself driving cars but the car did 11 accidents in six years. google car have some technocal incorrections so car did several accidents.

గూగుల్ కార్.. 11 యాక్సిడెంట్ లకు కారణం

Posted: 05/12/2015 04:33 PM IST
Google introduced theself driving cars but the car did 11 accidents in six years

గూగుల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి నమ్మకం. వేల కొట్ల మంది గూగుల్ బ్రాండ్ ను మనస్పూర్తిగా నమ్ముతారు. అయితే గూగుల్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉంటుంది. అలా అప్ డేట్ అయ్యే క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోటోటైప్ కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం శాంటా క్లారాతో చేతులు కలిపి గూగుల్ ఈ కాన్సెప్ట్ కారును తయారు చేసింది. ప్రస్తుతం గూగుల్ డ్రైవర్ లెస్ కారు టెస్టింగ్ దశలో ఉంది. ఎంతో లేటెస్ట్ టెక్నాలజీతో వీటిని రూపొందించినా.. పూర్తిస్థాయిలో ప్రమాదాలు అరికట్ట లేకపోతున్నారు. గత ఆరేళ్ల కాలంలో 11 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం అధిపతి క్రిస్ ఉర్మ్ సన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరింతగా అధ్యయనం చేసి.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్ వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. కారు పైభాగంలో, ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్.డి సరౌండ్ .కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటి సాయంతో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది. కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో కూర్చున్న వారు చేయాల్సిందల్లా రెండు సీట్లకు మధ్యలో ఉన్న స్టార్ట్,స్టాప్ బటన్ ను ప్రెస్ చేయటమే. గూగుల్ త్వరలోనే ఇలాంటి 100 ప్రోటోటైప్ కార్లను తయారు చేయనుంది. టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయ్యి, అన్ని సెక్యూరిటీ సమస్యలు పరిష్కరించబడినట్లయితే, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను 2020 నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  car  accidents  

Other Articles