Maharastra | Bar | Alchohol

Maharastra govt facing difficulties from opposition maharastra govt propose to ban on alchohol in state but some ministers opened bar in the city

Maharastra, Bar, Alchohol

Maharastra govt facing difficulties from opposition. Maharastra govt propose to ban on alchohol in state. but some ministers opened bar in the city.

మందు నిషేదం అంటారు కానీ మంత్రులే..

Posted: 05/12/2015 04:29 PM IST
Maharastra govt facing difficulties from opposition maharastra govt propose to ban on alchohol in state but some ministers opened bar in the city

చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి మాత్రం సారనె కొంపలు అని తెలుగులో ఓ సామెత ఉంది. అంటే నీతులు వల్లించడానికి ముందు మనం పాటించాలని అర్థం. అయితే రాజకీయ నాయకులు మాత్రం అచ్చు గుద్దినట్లు ఈ సామెతకు తగ్గట్లుగానే వ్యవహరిస్తారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన అక్కడి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఇరుకున పెట్టేసింది. అయ్యా పక్క వారికి నీతులు చెప్పడం కాదు.. ముందు మీరు కరెక్ట్ గా ఉండండి అంటూ అక్కడి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంతకీ ఎందుకు అంతలా మండిపడుతున్నాయో తెలుసా..

మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. గతంలో లాగానే దశల వారీగా మద్యపాన నిషేధానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా ఫడ్నవీస్ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ షిండే, దీపక్ కేసర్కార్ అహ్మద్ నగర్‌ లో ఒక బారు ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రి మద్యనిషేధం అంటే, మంత్రులు మద్యపానమంటున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకు పడ్డారు. బారుకు రిబ్బన్ కట్ చేయడంతో హోంశాఖ సహాయమంత్రి రామ్ షిండే, ఆర్థిక శాఖ సహాయమంత్రి దీపక్ కేసర్కార్ ఇరకాటంలో పడ్డారు. ఫడ్నవీస్ ‌కు చెడ్డపేరు తెచ్చారంటూ స్వపక్షం నుంచి కూడా విమర్శలు రావడం వారిని ఇబ్బందికి గురిచేసింది..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  Bar  Alchohol  

Other Articles