Jayalalitha Appeal Verdict: AIADMK special prayers

Karnataka hc to deliver verdict in jayalalithaa da case appeal today

Jayalalitha, former Tamil Nadu chief minister J Jayalalithaa, Tamil Nadu, Karnataka, Section 144, High Court. Disproportionate assets case, Code of Criminal Procedure, Tight security arrangements, Karnataka High Court, karnataka high court judgement, karnataka high court verdict

Tight security arrangements, including the invoking of Section 144 of the Code of Criminal Procedure (CrPC), have been made at the Karnataka High Court, which will pronounce it's judgement in appeals filed by former Tamil Nadu chief minister J Jayalalithaa

మరికోన్ని గంటల్లో తేలనున్న ‘పురచ్చి తలైవి’ భవితవ్యం

Posted: 05/11/2015 09:55 AM IST
Karnataka hc to deliver verdict in jayalalithaa da case appeal today

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో, మరికోన్ని గంటల్లో కర్ణాటక న్యాయస్థానం ఎలాంటి తీర్పును వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకోంది. అంతేకాదు ఈ తీర్పు నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ ను అమలుపర్చగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో కూడా టెన్షన్ వాతావరణం అలుముకుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఇదే కేసులో వారం రోజులపాటు జయలలిత జైలులో గడపవలసి వచ్చింది. కానీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిలుపై మళ్ళీ బయటకు రాగలిగారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేస్తూ ఆమె కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టును మూడు నెలలలోగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించవలసిందిగా ఆదేశించింది.దీంతో జయలలిత కేసుపై కర్ణాటక హైకోర్టు మరికోద్ది సేపట్లో తుది తీర్పు వెలువరించనుంది

ఒకవేళ హైకోర్టు కూడా ఆమెకు ప్రత్యేక కోర్టు వేసిన నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా శిక్షనే ఖరారు చేసినట్లయితే ఆమె మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. అదే జరిగితే మళ్ళీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించడం కూడా ఖాయం. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెకు బెయిలు మంజూరు చేసేవరకు జైలు జీవితం తప్పకపోవచ్చును. అయితే ఆమె ఇవాళ కర్నాటక హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు కనుక ఆమె చెన్నైలోని తన నివాసంలోనే ఉండి కోర్టు తీర్పును తెలుసుకోనున్నారు. తమిళనాడులో జయలలిత అన్నా డీఎంకే పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక ప్రభుత్వం ఆమెను జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. కాగా జయలలితకు కోర్టు శిక్షను విధంచకూడదంటూ అమె పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  karnataka high court  judgement  

Other Articles