fire accident in balanagar industrial area

Harsha plastic company workers flee as fire accident taken place

harsha plastic company workers flee, fire accident in gandhi nagar, fire accident, fire accident in balanagar industrial area, gandhinagar, plastic company, harsha plastic company, balanagar industrial area, fire engines, industry top floor collapsed

workers flee from harsha plastic company, as fire accident took place in gandhi nagar, balanagar industrial area, hyderabad

ఈ సారి ప్లాస్టిక్ పరిశ్రమలో.. కార్మికుల ఉరుకులు.. పరుగులు..

Posted: 05/11/2015 09:53 AM IST
Harsha plastic company workers flee as fire accident taken place

హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సారి బాలానగర్ పారిశ్రామిక వాడలోని గాంధీనగర్ లో వున్న ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా భయటకు ఉరుకులు పరుగులు తీశారు. పెద్దగా ఎగసి పడిన మంటలు స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. బాలానగర్ పారిశ్రామికవాడలో హర్ష ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఐదంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో భవనం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పై అంతస్థు ఇప్పటికే కూలిపోయిందని కూడా తెలుస్తోంది. గత 3 గంటలుగా 8 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ పరిశ్రమలోని మిషన్లు బాగా వేడెక్కడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీంతో పరిశ్రమలో పని చేసే కార్మికులందరూ అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. పరిశ్రమలో అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చేలరేగాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire accident  gandhinagar  plastic company  

Other Articles