RTC| Strike | Ap | Telangana

Rtc employees strike continues on third day

RTC, Strike, Ap, Telangana, Fitment, Salaries,

RTC employees strike continues on third day. RTC Employees demand for 43precent fitment but govt didnt ready to give that percent.

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. బస్సులు లేక జనం విలవిల

Posted: 05/08/2015 08:58 AM IST
Rtc employees strike continues on third day

ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మామూలు జనాలు నానా కష్టాలు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం అందినకాడికి దండుకుంటూ ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల చర్చలు జరపలేదు. కార్మికులు మాత్రం తాము డిమాండ్ చేస్తున్నట్లు ఫిట్ మెంట్ ఇస్తూ ప్రకటన చేస్తే గానీ సమ్మె విరమించేది లేదని ప్రకటించాయి. ప్రభుత్వం మాత్రం సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతూనే.. ప్రైవేట్ వ్యక్తులతో బస్సు సర్వీసులను నడిపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాత్కాలిక నియామకాలతోపాటు ప్రభుత్వ విభాగాల్లోని డ్రైవర్లను ఆర్టీసీ బస్సులకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో రెండు రాష్ట్రాల్లోని పలు డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిపోల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

కార్మికుల సమ్మె నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ఒప్పంద ఉద్యోగులు విధులకు వచ్చిందే తడవుగా వారి సేవలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరు వేల మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. గురువారం వరకు నామమాత్రపు సంఖ్యలోనే విధులకు హాజరు అయ్యేందుకు వీరు ఆసక్తి చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రోజువారీ వేతనంతో ఆర్టీసీలో సేవలందించేందు వచ్చే తాత్కాలిక ఉద్యోగులకు భవిష్యత్తులో సంస్థ చేపట్టే నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వీరికి 30 శాతం వరకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. విధులు నిర్వహించిన వారికి ధ్రువపత్రాన్ని ఇస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరో పక్క ఆర్టీసీ సమ్మెతో రైళ్లలో రద్దీ పెరిగింది. సాధారణ రైళ్లు,  ఎంఎంటీఎస్ రైళ్లలో జనాలు ఇబ్బందులు పడుతూనే ప్రయాణాలు సాగిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Strike  Ap  Telangana  Fitment  Salaries  

Other Articles