Prohibition | Nirbhaya | Document

Pm narendra modi support the probition on nirbhaya documentary

Prohibition, Nirbhaya Documentary,PM MODI,Newdelhi

Pm Narendra modi support the Probition on Nirbhaya documentary. BBC channels documentary Daughter of india got probition in india.

ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ నిషేదం కరక్టే; ప్రధాని మోదీ

Posted: 05/08/2015 08:21 AM IST
Pm narendra modi support the probition on nirbhaya documentary

ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని నిషేధించడంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడారు. 2012లో ఢిల్లీలో సంచనలం సృష్టించిన నిర్భయపై సామూహిక లైంగికదాడి ఘటనను ఆధారంగా చేసుకొని బ్రిటీష్ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ రూపొందించిన ఆ డాక్యుమెంటరీలో ప్రజల మనోభావాలు దెబ్బతీసే అంశాలున్నాయన్న కారణంతో ప్రభు త్వం నిషేధించింది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా తన అధికారిక నివాసంలో టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ డాక్యుమెంటరీతోపాటు మైనారిటీల సమస్యలు, వారిని భయపెట్టేలా కొందరు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని, అది చట్టంకంటే ఉన్నతమైన అంశమని పేర్కొన్నారు. దీనిని భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నగా నేను భావించటంలేదు. ఇది చట్టంకంటే ఉన్నతమైంది. ఈ కేసులో బాధితులు, న్యాయ విచారణ విధానానికి గౌరవం ఇవ్వాలి అని అన్నారు. కులం, మతం ప్రాతిపదికన మైనారిటీల పట్ల వివక్షను సహించబోమని స్పష్టంచేశారు. మైనారిటీలపై ప్రజాప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే ఖండించామని చెప్పారు. భారత్- చైనా సరిహద్దు సమస్య పరిష్కారం విషయంలో చరిత్ర నుంచి రెండు దేశాలు పాఠాలు నేర్చుకొంటున్నాయని వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prohibition  Nirbhaya Documentary  PM MODI  Newdelhi  

Other Articles