A Husband Named Ashok Killed Wife Rani For Not Giving Ten Rupees in West Delhi

Husband ashok killed wife rani for ten rupees west delhi crime incidents

husband kill wife, west delhi police, delhi crime stories, ashok killed wife rani, man killed wife for ten rupees, ten rupees killed women

Husband Ashok Killed Wife Rani For Ten Rupees West Delhi Crime Incidents : According to West Delhi Police.. Husband ashok killed his wife rani for not giving ten rupees.

పదిరూపాయల కోసం భార్యను కడతేర్చిన కసాయి

Posted: 05/06/2015 08:55 PM IST
Husband ashok killed wife rani for ten rupees west delhi crime incidents

ప్రస్తుతకాలంలో కొందరు డబ్బు వ్యామోహంలో పడి బంధుత్వాలను మరిచిపోతున్నారు. ఆస్తికోసం కుటుంబసభ్యులే గొడవపడటం, డబ్బుకోసం సన్నిహితులను దూరం చేసుకోవడం, ఇలా ఎన్నోరకాలుగా ఈ డబ్బు చిచ్చుపెడుతోంది. అంతవరకెందుకు.. కేవలం 50, 100 రూపాయలకోసం ఒకర్నొకరు చంపుకుంటున్నారు. డబ్బుమీదున్న ప్రేమతో ప్రాణం విలువ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇందుకు నిదర్శనంగానే తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.10 కోసం తన భార్యనే కడతేర్చాడో కసాయి!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ (61) అనే వ్యక్తి తన భార్య రాణి(42)ని పది రూపాయలు ఇవ్వమని అడిగాడు. అయితే.. డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది చిలికిచిలికి గాలివానగా మారడంతో.. అశోక్ కోపాద్రిక్తుడయ్యాడు. అతడు వంటింట్లోంచి కత్తిని తీసుకొచ్చి.. తన భార్యను పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో శవమైపడి వున్న రాణిని చూసి.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband kill wife  delhi crime stories  

Other Articles