Coal scam: Naveen Jindal, Koda, 13 others summoned as accused

Trial court summons naveen jindal 14 others on may 22

Trial court summons Naveen Jindal, Trial court summons 14 others on May 22, CBI chargesheet in coal block case, cbi names dasari narayan rao, jindal, Amarkonda Murgadangal coal block, Jharkhand coal block allocation case, Naveen Jindal, CBI, CBI chargesheet,crime, law and justice ,police ,energy and resource ,coal, Central Bureau of Investigation (CBI), coal scam, Jindal Steel and Power (JSPL), Naveen Jindal, India business report

The court summoned them for alleged offences punishable under sections 120-B (criminal conspiracy), 420 (cheating) and 409 (criminal breach of trust by public servant) of the IPC and under the provisions of the Prevention of Corruption Act.

బొగ్గు కుంభకోణం: దాసరి, జిందాల్, మదుకోడాలకు కోర్టు సమన్లు

Posted: 05/06/2015 06:36 PM IST
Trial court summons naveen jindal 14 others on may 22

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం నాడు తాజాగా దాఖలైన చార్జిషీటులోని నిందితులకు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారయణ రావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాలకు ఈ సమన్లను జారీ చేసింది. వీరితో పాటు బొగ్గు కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న మరో 12 మందిఃకి సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీరితో పాటుగా మరో ఐదు కంపెనీలపై కూడా సమన్లను జారి చేసింది.

అమరకొండ ముర్గాదంగల్(జార్ఖండ్) బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో వ్యక్తులతో పాటు పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు ఈ నెల 22న సీబిఐ ప్రత్యక న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని.. న్యాయమూర్తి భరత్ పరశ్ కర్ అదేశించారు. నిందితులందరిపై సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర) సెక్షన్ 420 (ఛీటింగ్) సెక్షన్ 409 (ప్రజా సేవకుడి నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) తో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. జిందాల్, దాసరి, మదుకోడాతో పాటుగా బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తా, జ్ఞాన్ స్వరూప్ గర్గ్, సురేష్ సింగాల్, రాజీవ్ జైన్, గిరీష్ కుమార్ సునిజా, అర్కే సరాప్; రామకృష్ణ ప్రసాద్ లకు న్యాయస్థానం సమన్లను జారీ చేసింది. వీరితో పాటు గగన్ ఇన్ ఫ్రా ఎనర్జీ, న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సౌబాద్య మీడియా లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు కూడా సమన్లు జారీ చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayan rao  jindal  Amarkonda Murgadangal coal block  

Other Articles