YSRCP support to Sivaji's 'Fast unto Death'

Actor sivaji slams bjp over ap special statue

Sivaji, Hero Sivaji, BJP politician Sivaji, YSRCP support to Sivaji's 'Fast unto Death', sivaji slams bjp over ap special statue, YSRCP, YSRCP MLA Jogi Ramesh, Sivaji Hunger Strike, Andhra Pradesh Special Status, AP Special Status, ap special status, indefinite fasting, BJP, modi,

Telugu cinema hero turned BJP politician Sivaji has started fast unto death with the aim of achieving special status to Andhra Pradesh. His fast has reached third day today.

నటుడు శివాజీ దీక్షకు పెరుగుతున్న మద్దతు..

Posted: 05/05/2015 04:03 PM IST
Actor sivaji slams bjp over ap special statue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇవ్వాలంటూ నటుడు శివాజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆయనకు పలు పార్టీల నుంచి సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ శివాజీ దీక్ష స్థలికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం సొంత పార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగరవేసిన శివాజీని అభినందించారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్ఓల సంఘం కూడా శివాజీ దీక్షకు మద్దతు పలికింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్ఓల సంఘం అధ్యక్షుడు కూడా దీక్షస్థలికి వెళ్లి శివాజీ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆమ్ అద్మీ పార్టీ సహా పలు పార్టీలు, కుల సంఘాలు కూడా శివాజీ దీక్షకు మద్దతు పలికాయి.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా విమర్శలను ఎక్కుపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని శివాజీ ఆరోపించారు. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. ఢిల్లీ ప్రజలు కుళ్లుకునేలా ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. దీక్ష మూడవ రోజుకు చేరడంతో.. తన ఆరోగ్యం కోంత క్షీణించిందని.. అయినా తన ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగుతుందని శివాజీ స్పష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivaji  ap special status  indefinite fasting  BJP  modi  

Other Articles