Indian media, media, army, resuce teams, nepal, earth quake,

Why nepalise reject indian media

Indian media, media, army, resuce teams, nepal, earth quake,

Indian media highlighting only indian army, and rescue teams from india. Nepalis anger on indian media for its over action, nepalis did a campaign for media to go home.

నేపాల్ లో ఎందుకు సహాయం వద్దందో తెలుసా?

Posted: 05/05/2015 04:50 PM IST
Why nepalise reject indian media

నేపాల్ లొ వచ్చిన బారీ భూకంపానికి అక్కడి జీవనం దుర్భరంగా తయారైంది. అయితే అక్కడి వారికి మేమున్నాం అంటూ మన వాళ్లు సహాయానికి ముందుకు వచ్చారు. అక్కడి వారిని ఆదుకోవడమే కాకుండా అందరి మన్ననలు పొందారు. మరి అంతలా సాయం చేసిన మన వారిని, మన మీడియా వారిని దయచేసి దేశం వదలండి బాబు అంటూ అక్కడి వారు అనడం మన వాళ్లకు బాధ కలిగించింది. భూకంపం వచ్చిన తర్వాత నేపాల్ కు ప్రధాని మోదీ సహాయపడిన విధానం అందరిని మెప్పించింది. ప్రపంచ వ్యప్తంగా అన్ని దేశాల నుంచి , ముఖ్యంగా వేలాదిమంది నేపాలీయుల నుంచి ట్విట్టర్ సందేశాలు వచ్చాయి. మీడియా ఈ వారంరోజులు సెంటి మెంట్ తో నేపాల్ కష్టం తప్ప లోకంలో మరోవార్త లేవన్నట్లు పూర్తి కవరేజ్ ఇచ్చాయి. నేపాలీయుల రక్షణలో నేపాల్ లో భారతీయుల రక్షణలో నిర్విరామంగా కృషిచేస్తున్న భారతీయ సైనికులు , రిస్క్యూ టీమ్ కృషిని హైలైట్ చేశాయి.

అదే నేపాలీయుల ఆగ్రహానికి కారణమైంది. సొంతడబ్బా ప్రచారం ఎక్కువై  వచ్చిన అసలు పని తక్కువై పోయిందని తెలిసేటప్పడికి.. చేతులు కాలాయి.. ఇంకా సహాయం అందని భూకంప బాధితులు వేలాది మంది ఉన్నారు. వారందరికీ సహాయం కల్పించ కుండా భారతీయులను రక్షించడం పైనే ఇండియా రిస్క్యూ టీమ్ లు దృష్టి పెట్టాయని, అడుగడుగునా పబ్లిసిటీ ఎక్కువై పోయిందని అక్కడి వారు అంటున్నారు. నేపాల్ సహాయ చర్యలకన్నా రిస్క్యూ టీమ్ ల పబ్లిసిటీ స్టంట్ పై కొన్నచోట్ల నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్ హుందాగానే స్పందించింది.. వేలాది మంది రెస్క్యూకార్మికులు. హెలికాప్టర్ల తో తెచ్చిన వేల, కోట్ల టన్నుల సహాయ సామగ్రి. వచ్చింది. అయితే సహాయ కార్యక్రమాలు మాత్రం సంతృప్తి కరంగా లేవు.. అందుకే నేపాలీయులు అసంతృప్తితో ఉన్నారు. వారు చేసింది కన్నా.. హైప్ ఎక్కువైంది.. అని నేపాల్ పత్రిక టెలిగ్రాఫ్ నేపాల్ తెలిపింది. భారతీయ హెలికాప్టర్లుచ చైనా సరిహద్దుల్లో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దృష్టి పెట్టిందనే అభిప్రాయం కూడా నేపాల్ లో వ్యక్తమైంది. భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు .. ఏ మేరకు సహాయం చేసినా తక్కువే. అని సమన్వయం పూర్తిగా సాగదని.. ఖాట్మండు పోస్ట్ పేర్కొంది. భారతదేశం స్పందన, భారతీయ సైనిక దళాలు.. భారత్ ఉద్దేశం గొప్పవే చేసిన సహాయం కూడా అపూర్వమే కానీ.. భారతీయ మీడియా, సోషల్ నెట్ వర్క్ ల ఓవర్ యాక్షన్ మనకు చెడ్డపేరును తెచ్చిపెట్టాయి. చివరకు మంచి చేసి కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నట్లయింది. మరి ఈ మీడియా వారు ఎప్పటికి మారతారో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian media  media  army  resuce teams  nepal  earth quake  

Other Articles