ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారు జామున మొదటి సర్వీస్ నుంచి ఎక్కడి బస్సుల్ని అక్కడే నిలిపివేస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు ఎవరి రాష్ట్రాల్లో వారు గతంలోనే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూడా విడిగా సమ్మె నోటీసు ఇచ్చాయి. అన్ని సంఘాలు ఈనెల 6వ తేదీ నుంచే సమ్మెలోకి వెళ్తామని యాజమాన్యానికి తెలిపాయి. అయితే ఇప్పటి వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్టీసీల యాజమాన్యాలు ఎలాంటి సమ్మె నివారణ చర్యలు తీసుకోలేదు. కార్మికసంఘ నేతలతో సంప్రదింపులు జరపలేదు. ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెకు సన్నద్ధం చేయడం కోసం ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. అయినా యాజమాన్యం స్పందించలేదు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్‌పై ఈయూ-టీఎంయూ కూటమి గత నెల 2న సమ్మె నోటీసు ఇచ్చాయి. 43 శాతం ఫిట్‌మెంట్ కోసం ఏపీ ఎస్‌డబ్ల్యూఎఫ్, తెలంగాణ ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు సుందరయ్య, విఎస్ రావులు కూడా ఏప్రిల్ 7వ తేదీన ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావుకు సమ్మె నోటీసులను అందజేశాయి. రెండు రాష్ట్రాల్లోని యాజమాన్యాలు కార్మిక సంఘాలతో మొక్కుబడిగా జరిపిన చర్చలు ఫలించలేదు. ఎపిలో ఆరాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావుతో జరిపిన చర్చలు కూడా ఫలప్రదం కాలేదు. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో పాటు వాహన పన్ను నుంచి మినహాయించాలని, ఆర్టీసీ వినియోగించే డీజిల్‌పై వ్యాట్ ఎత్తి వేయాలని, విడి పరికరాల కొనుగోలుపై 14.5 శాతం వ్యాట్‌ను తగ్గించాలనే పలు డిమాండ్లను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పై డిమాండ్లపై ఏమాత్రం స్పందించలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లేందుకు సన్నధ్ధమౌతున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more