Narachandrababu, Dwcra, Loans, Cabinet,

Nara chandrababu naidu decided to clear dwcra group loans ap cabinet metting took some main decisions including dwcra group loans

Narachandrababu, Dwcra, Loans, Cabinet,

Nara chandrababu naidu decided to clear dwcra group loans. Ap cabinet metting took some main decisions including dwcra group loans.

డ్వాక్రా గ్రూపుల రుణాల మాఫీ కి చంద్రబాబు సై

Posted: 05/05/2015 07:59 AM IST
Nara chandrababu naidu decided to clear dwcra group loans ap cabinet metting took some main decisions including dwcra group loans

డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు ఆ మేరకు చర్యలకు పూనుకున్నారు. బడ్జెట్ లో మహిళా సంఘాల కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ను కేటాయించారు చంద్రబాబు. తాజాగా డ్వాక్రా సంఘాల్లో ప్రతి మహిళా సభ్యురాలికి 10 వేల చొప్పున రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. డ్వాక్రా రుణాలపై వడ్డీతోపాటు తక్షణమే 30 శాతాన్ని చెల్లించాలని తీర్మానించింది. మిగిలిన రుణాలను రెండు సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మహిళా సంఘాల రుణ మాఫీకి ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. డ్వాక్రా సంఘాల్లో 88 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఒక్కో సభ్యురాలికి రూ.10 వేల చొప్పున అందజేస్తే రూ.9000 కోట్లు అవుతుందని కేబినెట్‌ నిర్ధారణకు వచ్చింది. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు ఇప్పటి వరకు రూ.1284 కోట్లమేర వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని లెక్కించింది. ఈ నేపథ్యంలో, ఒక్కో సభ్యురాలికి ఇవ్వాలనుకున్న రూ.10 వేలల్లో తక్షణమే 30 శాతం చెల్లించాలని, దాంతోపాటు మొత్తం వడ్డీని కూడా తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.3000 కోట్లతోపాటు వడ్డీ రూ.1284 కోట్లను కలిపి మొత్తం రూ.4284 కోట్లను తక్షణమే బ్యాంకులకు చెల్లించాలని తీర్మానించింది. ఈ ప్రక్రియను జూన్‌ మూడో తేదీ నుంచి ఏడో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. మిగిలిన 70 శాతాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల్లో 35 శాతం చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్ ప్రణాళికలపై మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది.  జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. స్విస్‌ చాలెంజ్‌ పద్దతిలో సీడ్‌ కేపిటల్‌ మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. దీంతో పాటుగా డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలు మొత్తం వడ్డీతో కలిపి రూ. 4,086 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జూన్‌ 3 నుంచి 8 వరకు డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటితో పాటుగా విద్యుత్‌, నీరు-చెట్టు, ఇసుక, నిత్యావసర వస్తువుల ధరలపై చర్చించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసమీకరణపైనా కేబినెట్‌ భేటీలో చర్చించారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులోనే శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా సాధ్యమైనంత ఎక్కువగా భూములు సమీకరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.

ఏపి కేబినెట్ నిర్ణయాలు..
*జూన్ 8న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
*కాయగూరలు పండించే రైతులకు 50 శాతం విత్తన సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
*భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
*డ్వాక్రా సభ్యులకు రుణ విముక్తి కోసం నిధులు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
*స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో, సీడ్‌ కేపిటల్‌ కోసం మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
*ఈ నెల 16 నుంచి రుణమాఫీ విజయయాత్రలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Dwcra  Loans  Cabinet  

Other Articles