ISIS | Afghanistan | terrorists

Isis starting its functions from afghanistan

ISIS, Afghanistan, terrorists, World, blood, isis vidoes

isis starting its functions from afghanistan. ISis leaders already consider the afghan rebals. Afghanistan rebals supported to isis.

ఇక ఆప్ఘనిస్తాన్ కూ విస్తరించనున్న ISIS

Posted: 05/02/2015 04:37 PM IST
Isis starting its functions from afghanistan

ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తోన్న ISIS వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఇరాక్, సిరియాను ఆక్రమించి రక్తపుటేరులు పారిస్తోన్న ఈ ముష్కరమూక ఇప్పుడు దక్షిణాసియాపైనా కన్నేసింది. అస్థిరతకు మారుపేరైనా ఆప్ఘనిస్థాన్ లో జెండా పాతేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఆప్ఘనిస్థాన్.. ఈ పేరు చెప్పగానే తాలిబన్ల ఆగడాలు, ఆల్ ఖైదా అకృత్యాలే కళ్లముందు కదలాడుతాయి. ఇంకా చెప్పాలంటే తీవ్రవాదుల కనుసన్నల్లోనే నడుస్తుంది అక్కడి ప్రభుత్వం. వారు చెప్పిందే వేదం. చేసిందేచట్టం. ఈ ఉగ్రమూకల దుశ్చర్యలతో ఆఫ్గనిస్థాన్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆ దేశాన్ని మరో ఉగ్రభూతం వణికిస్తోంది.

కొన్నేళ్లుగా ఆప్ఘనిస్థాన్ లో తీవ్రవాదానికి అల్ఖైదానే చిరునామా. ఆ తర్వాత తాలిబన్లు పుట్టుకొచ్చారు. కానీ ఇప్పుడా స్థానాన్ని ఆక్రమించేందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా-ISIS ప్లాన్ వేస్తోంది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ISIS జెండాలతో శిక్షణ పొంతున్న కొందరు తీవ్రవాదుల దృశ్యాలు బయటకి రావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నరనరాన రాక్షసత్వాన్ని నింపుకొని ...విస్తరణకాంక్షతో రగిలిపోతున్న ISIS ఆప్ఘనిస్థాన్ లో నూ కాలుమోపినట్లు తెలుస్తోంది.. ఇందుకోసం డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎంచుకుంది . తాలిబన్లతో పొసగక బయటకు వచ్చిన ఓ వర్గాన్ని చేరదీసింది . వారి సహాయంతోనే అక్కడ విస్తరించేందుకు స్కెచ్ వేస్తోంది. దాదాపు 12 మంది మిలిటెంట్లకు శిక్షణ ఇస్తూ ఓ బ్రాంచ్ ను ఓపెన్ చేసింది. రిచెస్ట్ టెర్రర్ గ్రూప్ గా పేరొందిన ISIS... తాలిబన్ రెబల్ మిలిటెంట్లకు అత్యాధునిక శిక్షణ ఇస్తోంది. మిషన్ గన్స్, పర్వతాలను అధిరోహించే వెహికిల్స్ వారికి సమకూర్చింది. షార్ప్ షూటింగ్ లో నూ ఆరితేరేలా చేస్తోంది. రాక్షసత్వానికి మారుపేరైన ISIS ప్రపంచాన్నే ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనే లక్ష్యంతో నెత్తుటి కాండకు తెగబడుతోంది. యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది.. తాజాగా ISIS ఆప్ఘనిస్థాన్ లో కాలుమోపిందన్న వార్త ..ఆ దేశంతోపాటు పొరుగు దేశాలకు నిద్దుర లేకుండా చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Afghanistan  terrorists  World  blood  isis vidoes  

Other Articles