VH | Congress | KCR | Babu

Congress senor leader v hanmanth rao said that he is the guru of kcr chandrababu

Congress, KCRnaidu, school, political

Congress senor leader V.Hanmanth Rao said that he is the guru of kcr, chandrababu.

వాయమ్మనే.. విహెచ్ ఏమన్న చెప్పిండా.. అబ్బో

Posted: 05/02/2015 04:17 PM IST
Congress senor leader v hanmanth rao said that he is the guru of kcr chandrababu

తాటిని తన్నే వాడు ఒకడుంటే.. దాని తలదన్నే వాడు ఒకడుంటాడు అని ఓ సామెత ఉంది. అవును నిజం మనమే అనుకుంటే మనకన్నా చాలా మంది గొప్పవాళ్లు,. మేధావులు ఉంటారు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం ఇది పట్టదు. ఎందుకంటే వాళ్లు ఏం చెబితే అదే నిజం.. వాళ్లే పెద్ద మేధావులు... ఇంకా ఏమైనా పదాలు ఉంటే అంతా వాళ్లే. ఆ మధ్య తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది నేతలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు దానిపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కళాశాల అని, ఎంతో మంది ఇక్కడి నుండే వెళ్లారు అని అన్నాడు. తర్వాత కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుండే వెళ్లాడు అని అన్నారు. చంద్రబాబ నాయుడు మాటలకు హరీష్ రావ్ కౌంటర్ వేశారు. టిడిపిలో కేసీఆర్ చంద్రబాబు కన్నా సీనియర్ అంటూ వెల్లడించారు. అయితే తూచ్.. చంద్రబాబు, కేసీఆర్ లు ఇద్దరూ నా స్కూల్ నుండి వచ్చిన వాళ్లే అని అంటున్నాడో పెద్దాయన. అసలు ఆ సంగతేంటో తెలియాలా. అయితే చదవండి...

కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. పార్టీ పరంగానూ, పర్సనల్ గా కూడా ఇద్దరూ దుమ్మెత్తి పోసుకుంటారు. అయితే టిడిపి పార్టీ నుండే కేసీఆర్ వెళ్లాడని, తన దగ్గరే కేసీఆర్ శిష్యరికం చేశాడని అన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావ్ అసలు కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ తన స్కూల్ నుండే వచ్చారని అన్నారు. మొత్తానికి చంద్రబాబు, కేసీఆర్ లు ఇద్దరూ తన శిష్యులే అంటున్న వి. హన్మంత రావ్ కామెంట్ కు చంద్రబాబు గానీ, కేసీఆర్ కానీ స్పందిస్తారో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  KCRnaidu  school  political  

Other Articles