Heroic villager fights leopard with a stick | leopard attack | villager Indore |

India man fights off leopard with a st ck

India Man fights off leopard with a stıck, Heroic indian villager fights leopard with a stick, exteremely courageous footage viral on social media, encounter between Villager and leopard, Indore

An exteremely courageous footage emerged of an encounter between a Villager fighting a leopard in Indore.

ITEMVIDEOS: వావ్..! చిరుతను కర్రతో తరమిన సాహసి.. హల్ చల్ చేస్తున్న వీడియో

Posted: 04/29/2015 03:21 PM IST
India man fights off leopard with a st ck

పెద్దపులిని అల్లంత దూరం నుంచి  చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటి వేగంగా దూసుకెళ్లే చిరత.. అంతకన్నా వేగంగా విసిరే పంజాను నిజంగా చూడగలమా.. అది ఊహించుకుంటే.. మన పని అయిపోయిందనుకుంటాం. కానీ అక్కడ ఓ గ్రామీణ భారతీయ సాహసి మాత్రం.. అది చిరుత అయితే.. నేను మనిషిని.. దాన్ని చూసి నేను కాదు.. నన్ను చూసి అది భయపడాలి అనుకున్నాడో.. ఏమో.. చిరుతను కర్రతో కొట్టి తరిమేశాడు. చిరత అతడినికి కిందపడేసి.. దాడికి యత్నించింది. అయినా లేచిన సాహసి దానిని మళ్లి కర్రతో కోట్టే ప్రయత్నం చేశాడు. అంతే చిరుత పలాయనం చిత్తగించింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. ఇండోర్ జిల్లాలోని మౌ తహసిల్ పరిధిలోగల మన్ పూర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఓలానీ గ్రామంలోకి దూసుకోచ్చిన చిరతను సదరు గ్రామస్థుడు కర్రతో కోట్టి తరిమేశాడు. చిరతను కర్రతో అడ్డుకోబోతున్న క్రమంలో వెనక నుంచి పల్లెవాసులు.. కర్రతో కట్టవద్దు మామా. అది తిరగబడుతుంది.. అది ఇంట్లోకి వెళ్లిన తరువాత పట్టుకుందాం అంటూ చెబుతున్నా ఆ సాహసి వినిపించుకోలేదు. చిరుత పంజా కన్నా.. తన కర్ర పవరే ఎక్కువని భావించాడో ఏమో.. మొత్తానికి చిరుతను కోట్టి తరిమేశాడు. అయితే ఇదంతా గమనించిన పక్క గ్రామస్థుడు అటుగా వెళ్తూ తన సెల్ ఫోన్ లో ఈ ఉదంతాన్ని చిత్రీకరించాడు. ఇప్పుడా వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  attack  villager  Indore  

Other Articles