Nagam | Jandhan Reddy | Narachandrababu naidu |TTDP

Nagam janardhan reddy clear on his rejoining into telugudesam party

Nagam, Jandhan Reddy, TDP, Narachandrababu naidu, TTDP

Nagam Janardhan reddy clear on his rejoining into telugudesam party. nagam janrdhan reddy cleared that he is not joining into to tdp.

లేదు.. లేదండీ బాబూ.. నేనేమీ చేరడం లేదు: నాగం

Posted: 04/29/2015 04:01 PM IST
Nagam janardhan reddy clear on his rejoining into telugudesam party

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థులచేత దెబ్బలు తిని.. తరువాత తరువాత తెలుగుదేశం పార్టీని వీడారు నాగం జనార్దన్ రెడ్డి. అయితే నాగం జనార్దన్ రెడ్డి గత కొంత కాలంగా మరుగున పడ్డారు. బిజెపి పార్టీలో చేరి మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుండి పోటీచేసినా ఓడిపోయారు. అయితే బిజెపి పార్టీలో నాగంకు తగిన గుర్తింపు లేదని అందుకే తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్న పుకార్లు షికారు చేశాయి.

నాగం జనార్దన్ రెడ్డి తిరిగి సొంత గూటికే చేరుతున్నారు. ఆ మేరకు నారా చంద్రబాబు నాయుడుతో మంతనాలు కూడా ముగిశాయని పుకారు. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాగం పేరును ఖరారు చేస్తారని అనుకుంటున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీలో చేరికపై నాగం జనార్దన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో విలువలున్న మనిషిని అని, తాను పార్టీ మారటం లేదని ఆయన స్పష్టం చేశారు.  మే 9వ తేదీ నుంచి బచావో తెలంగాణ మిషన్ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నామన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శిస్తామని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagam  Jandhan Reddy  TDP  Narachandrababu naidu  TTDP  

Other Articles