tert exam will be conducted as per shedule says andhra pradesh minister ganta srinivasa rao

Dsc will be conduct as schedule ganta srinivasa rao

dsc will be conduct as schedule, tert exam will be conducted as per shedule, minister ganta srinivasa rao, Andhra pradesh minister ganta srinivasa rao, Andhra pradesh, tert dsc-2014, dsc exam,

no postponement of dsc exam, it will be conducted as per shedule says minister ganta srinivasa rao

షెడ్యూల్డు ప్రకారం డీఎస్సీ, వదంతులను నమ్మకండీ..

Posted: 04/24/2015 05:59 PM IST
Dsc will be conduct as schedule ganta srinivasa rao

ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాల పరీక్షలు (డీఎస్సీ) నిర్వహిస్తామని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ డీఎస్సీ వాయిదా పడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. నిరుద్యోగులు పుకార్లను నమ్మవద్దని గంటా సూచించారు. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే ఆశావహులు రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసాన్ని వుంచాలని మంత్రి కోరారు.

గతానికి భిన్నంగా టెట్ పరీక్షలు, ఆ తరువాత డీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపట్టకుండా.. 'టీచర్ ఎలిజిబిలిటీ కమ్ టీచర్ రిక్రూట్‌మెంటు టెస్టు' (టెర్ట్-డీఎస్సీ 2014) పరీక్షలను ఏకకాలంలో నిర్వహిస్తామని చెప్పారు. గత ఎన్నికలలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఒకే విధానం ద్వారా పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. టెర్ట్ పరీక్షలల్లో మధ్యాహ్నం జరిగే పరీక్ష సమయాలను మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు.  ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ వేళల మార్పు ద్వారా ప్రయోజనం కలగనుంది. డీఎస్సీ పరీక్షలను మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ganta srinivasarav  tert dsc-2014  dsc exam  

Other Articles