add third gender column in all forms, rbi to banks

Rbi directs banks to include third gender in forms

rbi directs banks to include third gender in forms, add third gender column in all forms, rbi to banks, Banks to include third gender column, RBI, SC, RBI on third gender, Reserve Bank of India, Banks in India, Supreme Court, third gender' Reserve Bank,

The Reserve Bank of India directed banks to include a separate column 'third gender' in all their forms and applications.

బ్యాంకుల్లో వారికి కూడా ఖాతాలు తేరుచుకోనున్నాయి

Posted: 04/24/2015 08:31 PM IST
Rbi directs banks to include third gender in forms

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ థర్డ్ జెండర్స్కు కూడా బ్యాంకు సేవలు అందేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్స్కు కూడా  బ్యాంకులలో ఖాతాను  తెరిచేందుకు వీలుగా ఒక ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కాలమ్ ను  బ్యాంకు దరఖాస్తు ఫారాల్లో చేర్చింది.  బ్యాంకులకు సంబంధించిన వివిధ లావాదేవీలు, ఖాతాను తెరిచే సందర్భంగా థర్డ్ జెండర్స్కు వస్తున్న  సమస్యలు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ అధికారులు  వెల్లడించారు.  దీనికనుగుణంగా  అన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేశామని  తెలిపారు.

ట్రాన్స్‌జెండర్లు కూడా రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులనూ పొందవచ్చంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రవేశ దరఖాస్తు ఫారాల్లో  స్త్రీ, పురుషుల కాలమ్‌లతోపాటు థర్డ్ జెండర్ కాలమ్‌ను కూడా చేర్చామని, ఇకపై ట్రాన్స్‌జెండర్లు తమ జెండర్‌ను అధికారికంగా ప్రకటించుకోవచ్చని సంస్థ తెలిపింది. గత ఏడాది ట్రాన్స్‌జెండర్లను అధికారికంగా గుర్తించిన సుప్రీంకోర్టు వారికి వెనుకబడిన తరగతుల క్యాటగిరీ కింది విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సౌకర్యాలు కల్పించాలని తీర్పునిచ్చింది.   

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  third gender' Reserve Bank  

Other Articles