Telangana | TDP | Jupally | Chandrababu

Telangana minister slams tdp president chandrababau naidus statements at mahabubnagar meeting

Telangana, jupally, krisnarao, chandrababu, TDP,

Telangana minister slams TDP president chandrababau naidus statements at mahabubnagar meeting. Chandrababu spoke lies at mahabubnagar meeting jupally krishna rao said.

తూచ్.. అంతా అబద్దాలు.. మామూలువి కూడా కాదు పచ్చి అబద్దాలు

Posted: 04/24/2015 01:02 PM IST
Telangana minister slams tdp president chandrababau naidus statements at mahabubnagar meeting

రాజకీయ నాయకుల మాటలకు కౌంటర్ అటాక్ వెయ్యడం మామూలే. అయితే అసలు ఆ నేత మాట్లాడిన మాటలు అన్నీ అబద్దాలే అని అంటున్నారు మరో రాజకీయ నాయకుడు. తెలంగాణలో నిన్న మహబూబ్ నగర్ బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు అన్నీ అబద్దాలే మాట్లాడరని.. పచ్చి అబద్దాలు అని తెలంగాణ పరిశ్రమల శాఖ జూపల్లి కృష్ణారావ్ మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడానికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు.

పాలమూరు సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి మహబూబ్‌నగర్ అభివృద్ధికి చంద్రబాబు ఏం కృషి చేశారని జూపల్లి కృష్ణారావ్ ప్రశ్నించారు. జిల్లాలోని ప్రాజెక్టులకు పదేళ్ల పాలనలో రూ.పది కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెదేపా పాలనవల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందంటున్న బాబు మరి అప్పుడు పింఛన్లు, ప్రాజెక్టులకు డబ్బులు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఇక్కడి దరిద్రాన్ని, వలసలను మరింత పెంచారని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుదత్పత్తి 5 వేల మెగావాట్ల కన్నా మించలేదని చెప్పారు. దీనిపై జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు, నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. 64 ఏళ్లలో గత ప్రభుత్వాలు అమలు చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత తెరాస సర్కార్ అమలు చేస్తోందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో తెదేపా కనుమరుగవడం ఖాయమని వ్యాఖ్యానించారు.మొత్తానికి చంద్రబాబు మాటలకు మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావ్ కౌంటర్ ఎటాక్ వేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  jupally  krisnarao  chandrababu  TDP  

Other Articles