Delhi | CM | Kejriwal | Apology

Delhi cm arvind kejriwal apologise to farmers family on famer suicide at aap rally

aap, kejriwal, farmer, suicide, apology, delhi, jantarmantar

Delhi cm arvind kejriwal apologise to farmers family on famer suicide at aap rally. AAP rally got tears on farmer suicide at jantarmantar. Political partys fire on kejriwal and aap for the farmers suicide.

క్షమించండి బాబూ అంటున్న ముఖ్యమంత్రి

Posted: 04/24/2015 11:08 AM IST
Delhi cm arvind kejriwal apologise to farmers family on famer suicide at aap rally

పాపం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ ప్రభుత్వాన్ని ఏమోగానీ తమ పార్టీకే నష్టం కలిగించింది. అన్ని పార్టీలు ఆ పార్టీపై దుమ్మెత్తిపోశాయి. ర్యాలీలో ఓ యువరైతు ఆత్మహత్య పార్టీలో సంచలనాన్ని కలిగించింది. అయితే పార్టీకి చెందిన నాయకులు చేసిన అతి వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్ని పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ఈ పాటి్కి ఆ పార్టీ ఏదో అర్థమైపోయిందా.. ఇంకే పార్టీ దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు.  ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్  తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు. ఘటన జరిగిన  రెండు రోజులు తర్వాత ఆయన స్పందించారు..నేను తప్పుచేశాను క్షమించండి.,,,  ఆ దుర్ఘటన తర్వాత నేను  ప్రసంగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి  ఉంటే మన్నించండి అని అన్నారు.

 భూసేకరణ సవరణ బిల్లుకు   వ్యతిరేకంగా బుధవారం ఆప్ తలపెట్టిన ర్యాలీ రాజస్థాన్ చెందిన 41 సంవత్సరాల గజేంద్రసింగ్  చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  అతణ్ని ఆసుపత్రి తరలించిన తరువాత దాదాపు పదినిమిషాలపాటు ప్రసంగించిన కేజ్రీవాల్ గజేంద్రను కాపాడ్డంలో ఢిల్లీ పోలీసులు  విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షాలు, ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు.  గజేంద్రను రక్షించడంలో  ఆప్ నేతలు, కార్యకర్తలు  నిర్లక్ష్యాన్నిప్రదర్శించారని,   వైదికపై ఉండి చోద్యం చూశారని మండిపడ్డారు.  దీనిపై గురువారం పార్లమెంటులో  గందరగోళం చెలరేగింది. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం క్షమాపణలు తెలిపినట్టు  సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  farmer  suicide  apology  delhi  jantarmantar  

Other Articles