IMD predicts below normal monsoon rains in 2015

Monsoon will be below normal this year says imd

Monsoon will be below normal this year, says IMD, IMD predicts below normal monsoon rains in 2015, El Nino weather pattern, India's monsoon rains, dry spell in the region, Union Science and Technology Minister Harsh Vardhan, monsoon season expected to be below normal,

ndia's monsoon rains could be below average in 2015 due to an impact of El Nino weather pattern, which can bring on a dry spell in the region.

వానమ్మ వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా..!

Posted: 04/22/2015 04:50 PM IST
Monsoon will be below normal this year says imd

నమ్మ వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా..! అంటూ వర్షాభావ పరిస్థితులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతులు మళ్లీ అదే రాగాన్ని అలపించాల్సి వస్తుందా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం ఈ ఏడాది కూడా సాధారణం కన్నా తక్కువ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బుదవారం పార్లమెంటులో తెలిపారు. జూన్ మాసం నుంచి సెప్టెంబర్ మాసం వరకు కోనసాగనున్న వర్షకాలంలో కురిసే వర్షపాతాన్ని బట్టి పంటలు పండించుకునే రైతులకు ఈ సారి కూడా వరుణుడు పగబట్టనున్నాడు.

ఇదే అంశంమై పార్లమెంటులో ప్రస్తావించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్.. ఈ ఏడాది 93 శాతం వరకు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదని వారు వివరించారు. దీంతో భారత గ్రామీణంలో పోడి వాతావరణమే అలుముకోనుందన్నారు. గత ఐదు దశాబ్ధాల వార్షిక వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని సాధారణ వర్సపాతం సగటును చూస్తే... 96 నుంచి 104 మధ్య వర్షపాతం సాధరణ వర్షపాతంగా నమోదైందయి, కాగా, ఈ ఏడాది కేవలం 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదవుతుందని చెప్పారు. దీంతో వర్షాకాలంలో వర్షబావ పంటలైన వరి, చెరుకు, సోయాబీన్, పత్తి పంటలపై రైతుల్లో ఆందోళన నెలకోంది. గత ఏడాది సుమారుగా రెండు శాతం మేర తక్కువ వర్షపాతం నమోదు కావడంతో తెలంగాణ, మహరాష్ట్ర, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కరుపు ప్రభావిత పరిస్థితులు అలుముకున్న విషయం తెలిసిందే

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monsoon  IMD predictions  below normal  Harsh Vardhan  

Other Articles