police tried to hide cash and gold siezed from tdp leader

Huge cash seized by police from tdp leader

huge cash seized by police from tdp leader, police tried to hide cash and gold siezed from tdp leader, cash seized in kurnool, cash siezed in chagalamarri, kurnool ASP ravi krishna, kurnool, Cash seized, ravikrishna, police checkings in kurnool, police checkings in chagalamarri

police tried to hide cash and gold siezed from tdp leader

పరులు దొరికితే కేసు.. అధికార పార్టీ సభ్యులు దోరికితే..

Posted: 04/22/2015 04:48 PM IST
Huge cash seized by police from tdp leader

చట్టం ఉన్నవాడికి చుట్టం అన్న సినిమా డైలాగ్ నిజమో, ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం దానిని బాపుకునేందుకు పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పోలీసులు అధికార వర్గాల వారికి చుట్టాలు అన్నట్లు తాజా వ్యవహరాం మాత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారులో పెద్ద ఎత్తున డబ్బును, బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెంటనే ఆళ్లగడ్డ ఏఎస్పీ రవికృష్ణ వద్దకు తరలించినట్టు తెలుస్తోంది.

ఇయితే ఇక్కడే ఓక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వ్యక్తం ఎవరో సాదాసీదా వ్యక్తి అయివుంటే ఈ పాటికీ మీడియాకు సమాచారం అందించి.. డబ్బును సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు కూడా అప్పగించేసే పోలీసులు.. సదరు వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడని తెలిసి.. అతడిని వదిలేయడానికి ప్రయత్నాలు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా విషయాన్ని సద్దుమణిగేలా చేద్దామనుకున్న పోలీసులకు మీడియా షాక్ ఇచ్చింది. ఈ ఘటనపై సమాచారాన్ని అందుకున్న మీడియా.. కథనాలను వెలువరించింది. దీంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిని పోలీసులు.. సదరు వ్యక్తి నుంచి రూ.40 వేలే పట్టుబడినట్టు చెబుతు సీన్ మొత్తాన్ని మార్చేందుకు ప్లాన్ చేశారు. ఇదే విషయాన్ని మీడియా ప్రసారం చేసింది. దీంతో నాలుక కరుచుకున్న పోలీసులు చేసిది లేక విషయాన్ని మెల్లిగా చెప్పారు. నిన్న ఆర్థరాత్రి 28 లక్షల రూపాయలతో పాటు 116 గ్రాముల బంగారాన్ని ఓ వ్యక్తి (అధికార పార్టీకి చెందిన నాయకుడిగా బావిస్తున్న) తరలిస్తుండగా ఆ డబ్బును స్వాధీన పర్చుకున్నామని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kurnool  Cash seized  ravikrishna  police checkings  

Other Articles