want to give Net to industrialists too, Rahul asks Modi govt

Want a law on net neutrality

rahul gandhi, narendra modi, net neutrality, parliament session, budget session Congress vice president Rahul Gandhi, rahul accused Narendra Modi regime of trying to give away Internet space to some corporate groups, BJP goverment on net neutrality, Internet, Net neutrality, rahul gandhi, Sumitra mahajan,

Congress leader Rahul Gandhi on Wednesday accused the Narendra Modi regime of trying to give away Internet space to some corporate groups, a charge vehemently denied by the government.

నెట్ న్యూట్రాలిటీపై పార్లమెంటులో దుమారం

Posted: 04/22/2015 04:46 PM IST
Want a law on net neutrality

లోక్సభలో బుధవారం ఇంటర్నెట్లో నెట్ న్యూట్రాలిటీ దుమారం చెలరేగింది.  లోక్‌సభలో నెట్ న్యూట్రాలిటీపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాందీ.. కేంద్రంలోని మోడీ సర్కార్ ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంటర్నెట్ను కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెట్ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నెట్ను కార్పొరెట్ కంపెనీల చేతిలో పెట్టడం సరికాదన్నారు. ఈ అంశంపై చర్చించాలని రాహుల్ ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు.  నెట్‌ న్యూట్రాలిటీ కోసం పోరాడేందుకు పది లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన అన్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ జరిగిందని రాహుల్‌ తెలిపారు. ఈ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు ఇచ్చేయాలని అనుకుంటోందని ఆయన ఆరోపించారు. ట్రాయ్‌ సంప్రదింపులను నిలిపివేయాలని కోరుతున్నట్లు ఆయన అన్నారు. చట్టాన్ని మార్చాలని... లేదా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అంతర్జాల సమానత్వానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాల ఒత్తిడికి తలవంచిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అంతర్జాల వినియోగంపై ప్రభుత్వం కమిటీ వేసిందని... ట్రాయ్‌ కూడా సంప్రదింపులు జరుపుతోందని రవిశంకర్‌ వెల్లడించారు. కాగా, 2012లో ఎవరెవరి ట్విట్టర్‌ ఖాతాలు నిలిపివేశారో, ఎందుకు నిలిపివేశారో విచారణ జరగాలని అన్నారు. అందరి వాణి వినాలని మేము కోరుకుంటున్నామని, యువతరం, ఇంటర్నెట్‌ భవిష్యత్‌ను మేము సురక్షితంగా ఉంచుతామని ఆయన అన్నారు. యూపీఏ సర్కార్లాగా తాము కార్పొరేట్లకు ఎప్పుడూ తలవంచలేదని, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.  నెట్‌ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాలన్న రాహుల్‌ గాంధీ ప్రతిపాదనకు మాత్రం ప్రభుత్వం స్పందించలేదు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  narendra modi  net neutrality  parliament session  

Other Articles