Anushka Sharma hitches a ride in Virat Kohli IPL team bus | IPL

Anushka sharma hitches a ride in virat kohli ipl team bus

anushk sharma, virat kohli news, anushka controversy, anushka sharma controversy, virat kohli controversies, virat kohli updates, anushka virat love angle, anushka virat affair

Anushka Sharma hitches a ride in Virat Kohli IPL team bus : Having stood by each other after the backlash they faced due to Virat Kohli’s unfortunate performance at the Cricket World Cup in Australia last month, Anushka Sharma and beau Virat Kohli are done keeping their relationship under wraps.

సమయం దొరికింది.. కోహ్లీ బస్సులో దూరింది.. అంతే!!

Posted: 04/14/2015 07:55 PM IST
Anushka sharma hitches a ride in virat kohli ipl team bus

భారతదేశంలో వివాదాస్పదమైన ప్రేమజంట ఎవరంటే ప్రతిఒక్కరు ఠక్కున కోహ్లీ, అనుష్క పేర్లు చెప్పేస్తారు. ఎందుకంటే.. ఈ ప్రేమపావురాలు ఇప్పటివరకు కాంట్రోవర్సీల్లో ఇరుక్కోవడమే తప్ప కాంప్లిమెంటరీలు పొందలేదు. అనుష్కతో ప్రేమాయణం నడుపుతున్నప్పటి నుంచి కోహ్లీ సరిగ్గా ఆడకపోవడం ఒక కారణమైతే.. ఎప్పుడైతే అనుష్క మైదానంలో కోహ్లీ ఆటను చూసేందుకు వస్తుందో అప్పుడే భారత్ జట్టు ఘోరంగా పరాజయం పాలవుతుంది.

అందుకు ఉదాహరణగా.. మొన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో అనుష్క ఇండియా మ్యాచ్ చూసేందుకు భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లగా టీమిండియా దారుణంగా ఓటమిపాలయ్యింది. అంతే! భారత్ అభిమానులు ఒక్కసారిగా వీరిద్దరపై విమర్శల దండయాత్ర ప్రారంభించారు. ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఈ ప్రేమజంట వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఏకాంత సమయాన్ని బాగానే గడుపుతోంది. వీరిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. తాజాగా అనుష్క ఛాన్స్ వచ్చింది కదా అని కోహ్లీ బస్సులో దూరడంతో ఈ జంట మళ్లీ వార్తల్లోకెక్కింది.

ఐపీఎల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన అనుష్క.. ఈ సీజన్ మొత్తం కోహ్లీతోనే కలిసి తిరుగుతోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ వీక్షించిన అమ్మడు.. కోహ్లీకి చీర్స్ చెప్పి ఉత్సాహపరిచింది. అంతేకాదు.. వాళ్ల టీమ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఎక్కి ప్రయాణించిందట! ఆ బస్సులో కోహ్లీ, అనుష్క పక్కపక్క సీట్లలో కూర్చొని సందడి చేసినట్లు వార్తలొస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఇద్దరూ తమ ఫోన్లతో తెగ బిజీగా కనిపిస్తున్నారు.

అయితే.. ఈ విధంగా అనుష్క ఐపీఎల్ టీం కేటాయించిన రాయల్ చాలెంజర్స్ బస్సులో కోహ్లీతో పయనించడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకోసం బస్సు కేటాయిస్తే.. అందులో అనుష్కను ఏం పని? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushk sharma  virat kohli  royal challengers bangalore  ipl 8  

Other Articles