Modi | Coalgate | Upa | Nda | Manmohan

Pm narendra modi fire on upa govt for coal allocations

narendramodi, modi, pm, india, france, upa, nda, coalgate, coal, manmohan singh

pm narendra modi fire on upa govt for coal allocations. Modi siad that upa govt allot the coals for rapidly like pens and kafchifs. The new nda govt very dedication for the Indian economy gowth.

పెన్నులు, కర్చీఫ్ లు ఇచ్చినంత తేలిగ్గా వాటిని ఇచ్చేశారు: మోదీ

Posted: 04/13/2015 08:16 AM IST
Pm narendra modi fire on upa govt for coal allocations

విదేశీ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ యూపీఏ సర్కార్‌ అవినీతిపై పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. దేశానికి లక్షల కోట్ల ఆదాయవనరులను సమకూర్చే కోల్‌బ్లాక్‌ల కేటాయింపులో యూపీఏ అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. పెన్నులు.. కర్చీఫ్ లు ఇచ్చినంత తేలిగ్గా వాటిని ఇచ్చేసిందని, ఫలితంగా రూ.లక్షల కోట్ల ఆదాయాన్ని దేశం కోల్పోయిందని దుయ్యబట్టారు. మనం ఎవరికైనా పెన్ను ఇచ్చినా.. సరైన వ్యక్తికే ఇస్తున్నామా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. కానీ యూపీఏ సర్కార్‌ మాత్రం లక్షల కోట్ల విలువైన కోల్‌బ్లాక్‌ల కేటాయింపులో ఆ మాత్రం ఆలోచన కూడా చేయలేదు అని ప్రధాని విమర్శించారు. పూర్తి అవినీతిమయంగా మారిన కోల్‌బ్లాక్‌ కేటాయింపులపై చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రద్దుచేసిందని, మాజీ ప్రధాని పేరు కూడా ఈ వివాదంలో ప్రముఖంగా వినిపించిందని గుర్తుచేశారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే 204 కోల్‌బ్లాక్‌లకుగాను కేవలం 20 బ్లాక్‌లను వేలంవేస్తే 2 లక్ష ల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగ్‌ పేర్కొన్న 1.76 లక్షల కోట్లకు మించిన ఆదాయాన్ని కోల్‌బ్లాక్‌ల వేలంలో రాబట్టామన్నారు.

ప్రధానిగా నా పది నెలల అనుభవంతో ఓ మాట చెబుతున్నా.. భారత్‌ ఇంకా పేదరికంలో ఉండటానికి కారణాలేవీ కన్పించడం లేదు అని వ్యాఖ్యానించారు. వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్నాయని, దేశాన్ని అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలు అధిరోహింపజేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతమండలి లో శాశ్వతసభ్యత్వం భారత్‌ హక్కు అని స్పష్టం చేశారు. ప్రపంచశాంతి కోసం భారత్‌ ఎన్నో త్యాగాలు చేసిందని, మొదటి ప్రపంచ యుద్ధంలో 14 లక్షలమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ వారి కోసం పోరాడటం సహజం. కానీ మరొకరి కోసం ప్రాణాలర్పించడమే అసలైన త్యాగం. ఈ వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుందని భావిస్తున్నా అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏ దేశం వెళ్లినా యుపిఎ అవినీతి, కోల్ స్కాంల గురించి మాత్రం మోదీ వాయిస్తున్నాడు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendramodi  modi  pm  india  france  upa  nda  coalgate  coal  manmohan singh  

Other Articles