UPSC | Civil services| Jat | Reservation | Supreme court

Upsc announce the results of civil services mains examination 2014

UPSC Union Public Service Commission, civil services, jat, reservation, supreme court, upa

esults of civil services (main) examination 2014 were declared tonight by the Union Public Service Commission (UPSC). The personality test of successful candidates is likely to commence from April 27, the UPSC said.

సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

Posted: 04/13/2015 09:15 AM IST
Upsc announce the results of civil services mains examination 2014

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 వెల్లడయ్యాయి. దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. అయితే సివిల్ పరీక్షల్లో జాట్లకు రిజర్వేషన్ కల్పించడంపై  కోర్టులో వివాదం సాగుతోంది. కోర్టులో వివాదం ఉండగానే యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ప్రధాన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 27 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది సివిల్స్ పరీక్షకు హాజరయ్యారు.

అయితే యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల నోటిఫికేషన్లో జాట్ల విషయాన్ని పేర్కొనలేదు. గతంలోని యూపీఏ ప్రభుత్వం జాట్లకు కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వారిని ఓబీసీల్లో చేర్చింది. అయితే, దీనిపై కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో కేంద్ర నిర్ణయం చెల్లుబాటుకాదని పేర్కొంటూ తుది తీర్పు వెలువరించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో ఆ తీర్పు వచ్చాకే ఫలితాలు వస్తాయని భావించగా.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించింది. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.inలో ఉంచింది.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UPSC Union Public Service Commission  civil services  jat  reservation  supreme court  upa  

Other Articles