Nalgonda Encounter: SI Siddaiah dead

Suryapet firing si siddaiah no more

SI siddaiah no more, si siddaiah dead, SI siddaiah took last breath at 4.06, SI siddaiah, police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorists shot dead,

SI Siddaiah who was injured in the Nalgonda encounter against simi criminals in Suryapet is no more as he took his last beeath at 4. 06 pm today says Kamineni hospital doctors

చికిత్స పొందుతూ అమరుడైన వీరుడు ఎస్ఐ సిద్ధయ్య

Posted: 04/07/2015 04:37 PM IST
Suryapet firing si siddaiah no more

నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద సిమి ఉద్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడి కామినేని అస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) ఇవాళ సాయంత్రం మరణించారు. ఈ నెల 4న సిమీ ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొని పట్టుకోబోయిన సిద్దయ్య గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకు చివరి శ్వాసను వదిలారు. నాలుగు రోజుల నుంచి సిద్దయ్యను బతికించేందుకు కామినేని అస్పత్రి వైద్యులు శతవిధాల చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కామినేని అస్పత్రిలో బావోద్వేగ వాతావరణం అలుముకుంది. సిద్దయ్య అమర్ హై అంటూ స్థానికులు, పోలీసులు, బంధువులు నినాదాలతో హోరెత్తించారు.

దుండగుల కాల్పుల్లో  సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకుపోగా,  10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటివరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది.  సుమారు 8 గంటలపాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్‌ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినా, కడుపులోని బుల్లెట్ వల్ల ప్రాణానికి ప్రమాదం లేకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు. అస్పత్రిలో చేరినప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే వున్న సిద్దయ్య.. అదే స్థితిలో అమరుడయ్యాడు.

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసేందుకు కామినేని ఆస్పత్రికి వచ్చిన ఆయన భార్య ధరణికి పురిటినొప్పులు రావడంతో ఆదే అస్పత్రిలోని ప్రసూతివార్డులో చేర్పించారు. భర్త అస్పత్రిలో చేరిన రోజునే అమె రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టినందుకు సంతోషం ఏ కోశాన లేకుండా ఇప్పుడా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఇరవై ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది వారి కుటుంబం. 2012లో పోలీస్ జాబ్ లో జాయిన్ అయిన సిద్దయ్య.. సరిగ్గా ఎన్ కౌంటర్ జరిగే రెండు రోజుల ముందు సెలవు కోరగా, మరో రెండు రోజుల ఆగి తీసుకోమని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ లోపు ఘటన చోటుచేసుకోవడంతో తీవ్రంగా గాయపడిన సిద్దయ్య అసువులు బాసారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI siddaiah  dead  kamineni hospital  

Other Articles