high alert in rangareddy shabad, police combing for armed persons

High alert in rangareddy shabad police combing for armed persons

high alert in rangareddy shabad mandal, police combing for armed persons, villagers of antharam scared, two suspects with ak 47 in shabad, police combing in rangareddy, suspects ran into forest, two armed persons got down from lorry in rangareddy, Simi terrorists, simi terrorists shot dead

nalgonda, nazeeruddin baba durga and surrounding where alleged simi terrorist took shelter before encounter. police got information that another suspect moving towards warangal

రంగారెడ్డి జిల్లాలో హైఅలర్ట్.. ఏకే 47 తుపాకులతో ఇద్దరి సంచారం..

Posted: 04/07/2015 04:17 PM IST
High alert in rangareddy shabad police combing for armed persons

నల్గొండ జిల్లాలో పోలీసులపై దాడికి పాల్పడి మగ్గురిని హతమార్చి, మరికోందరిని క్షతగాత్రులుగా చేసిన కేసులో నిందితులను మట్టుబెట్టిన దగ్గరనుంచీ.. తెలంగాణ జిల్లాల్లో పచ్చని పల్లెలన్నీ గజగజ వెనుకుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు వరుస ఎన్ కౌంటర్ ఘటనలతో భీతిల్లుతున్న పల్లెసీమల్లో.. కొత్త వారు కనబడితే. చాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తేే.. పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. తెలంగాణలోనే కాదు అటు నవ్యాంధ్రలోనూ ఇవే పరిస్థుతులు ఉత్పన్నమవుతున్నాయి.

నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మురళీ అనే వ్యాపారిని కారు లిఫ్ట్ అడిగి నిలువునా దోచుకుని పక్కనున్న పోలాల్లోకి పారిపోయిన అగంతకుల సంబంధించిన సమాచారం కూడా సంచలనానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తి వద్ద పోలీసులపై తిరగబడిన సిమీ కార్యకర్తలను మట్టబెట్టడంతో మరోమారు పల్లెలు భయం గుప్పిట్లో చిక్కకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తవారు.. అందునా.. ఆయుధాలు కలిగి సంచరించే వారిని చూస్తే.. జనం తక్షణం పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

ఈ తరుణంలో ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం అంతారం గ్రామ శివార్లలో ఇద్దరు సాయుధులైన అగంతకులను చూసి గ్రామస్థులు భీతిల్లారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హై అలర్ట్ ప్రకటించారు. షాబాద్ నుండి రాకపోకలున్న అన్ని ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. గ్రామాలన్ని క్షణ్ణంగా తనికీలు చేస్తున్నారు. సాయుదులు లారీ లోంచి దిగి అడువులలోకి పారిపోయారని స్థానికులు చెప్పడంతో ఆ ప్రాంతమంతా పోలీసులు జల్లెడ పడుతున్నున్నారు. విజయవాడలో మురళీ అనే వ్యాపారిని బెదింరించిన వాళ్లు వీళ్లేనా.. లేక నల్గొండ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న ముష్కరులా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police combing  rangareddy  simi suspect  armed parsons  

Other Articles