Governor | Tax | GO

Is governor narasimhan start flame between telangana and ap

governor, tax, permitt, telangana, andhrapradesh, narasimhan, GO, entry tax

Is governor narasimhan start flame between telangana and ap? ap and telangana states governor esl narasimhan proposed a G.O on entry tax for vehicles.

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది 'గవర్నరే'నా..?

Posted: 04/03/2015 10:25 AM IST
Is governor narasimhan start flame between telangana and ap

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి అంకురార్పణ చేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ఫీజు విధిస్తు తీసుకున్న చట్టానికి ఏ చట్టం సహకరించింది? అంటే అన్నింటికి సమాధానం ఒక్కటే. గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి పాలన సమయంలో చేసిన కీలక మార్పులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పు రాజేసింది. సెక్షన్‌ 72 (2) ప్రకారం.. అపాయింటెడ్‌ డేకి ముందురోజు వరకు ఉభయ రాష్ట్రాల్లో చెల్లుబాటయ్యే పర్మిట్‌ ఉన్న రవాణా వాహనాలకు సంబంధించి ఏ రాష్ట్రమూ టోల్‌ ఫీజు కానీ, ఎంట్రన్స్‌ ఫీజు కానీ, అలాంటి స్వరూప స్వభావాలున్న ఇతర చార్జీలను కానీ విధించకూడదు. ఆయా రాష్ట్రాలను సంప్రదించి ఎంట్రన్స్‌ ఫీజు లేదా ఇతర చార్జీల విధింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వవచ్చు. 2014 జూన్‌ ఒకటో తేదీన రాష్ట్రపతి పాలన సమయంలోనే ఒక జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ పేరిట ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన లక్ష్మీపార్థసారథి దానిని జారీ చేశారు.

2015 మార్చి 31వ తేదీ వరకు  క్వార్టర్లీ ట్యాక్స్ ను రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చెల్లించినా అది రెండు రాష్ట్రాలకూ చెల్లించినట్లే. ఒకవేళ ఏదైనా ఉంటే  ఇరు రాష్ట్రాలూ కలిసి నిర్ణయం తీసుకుంటాయి- అని జీవో జారీ చేశారు. రెండు రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి అన్న ఆ ఒక్క పాయింట్ తో తెలంగాణ కొత్త జివోను విడుదల చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి తెర లేచింది.  విభజన చట్టంలోని 72(1) సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2015 మార్చి 31 తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చంటూ కొత్త అర్థం చెప్పినట్లయింది. చట్టంలోని సెక్షన్‌ 72(1)లో పర్మిట్‌ ఉభయ రాష్ట్రాల్లోనూ చెల్లుబాటు అవుతుందని, అందులో త్రైమాసిక పన్ను గురించి ప్రస్తావనే లేదని, కానీ దాని కోసమే గవర్నర్‌ జీవో జారీ చేశారని ఆరోపిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోనూ చెల్లుబాటు అయ్యే పర్మిట్‌ ఉన్న వాహనాలకు ఏ తరహా ఫీజులు, చార్జీలు వసూలు చేయరాదని విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా.. గవర్నర్‌ ఇచ్చిన జీవో అండతో పన్ను విధింపు అవకాశాన్ని చేజిక్కించుకుంది. విభజన చట్టంలో ‘పన్ను’ విధించకూడదని ఎక్కడా లేదని, ఎంట్రీ ట్యాక్స్‌ విధించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అధికారులు వాదిస్తున్నారు. దాని ఆధారంగానే ఎలాంటి పన్నునైనా విధించే అధికారం తమ ప్రభుత్వానికి ఉందని హైకోర్టులోనూ వాదిస్తున్నారు. మొత్తానికి గవర్నర్ గారు చేసిన ఓ జీవో ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor  tax  permitt  telangana  andhrapradesh  narasimhan  GO  entry tax  

Other Articles