kcr | fire | ministers

Telangana cm kcr fire on ministers

KCR, Telangana, ministers, elections, polls, departments, ministrys, schemes

telangana cm kcr fire on ministers. he warned to work hard and transpartent. In the next elections TRS mustbe win the polls the telangana cm KCR said.

మంత్రులకు కెసిఆర్ క్లాస్.. పద్దతి మార్చుకోవాలని హితవు

Posted: 04/03/2015 09:17 AM IST
Telangana cm kcr fire on ministers

పద్ధతి మార్చుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ హితవు పలికారు. అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా కొంత మంది  మంత్రులు ఇంకా స్వంత శాఖలపై పట్టుసాధించలేదని మండిపడ్డారు. అవినీతికి తావులేకుండా మంత్రులు పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని, ఇంకా ఉద్యమకారులుగా మాట్లాడితే ఉపయోగం ఉండదని సిఎం కెసిఆర్‌ మంత్రులకు సూచనలు చేశారు. మరో రెండు నెలలు గడిస్తే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని, ఇంకా కేటాయించిన శాఖలపై ఇప్పటికీ పట్టు సాధించకపోతే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని కెసిఆర్ సూచించారు. ఇదే సమయంలో పనితీరు ఆధారంగా మంత్రులకు గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా దూకుడు పెంచాలని ఆదేశించారు. మిషన్‌కాకతీయ పనుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వేసవికాలం పూర్తయ్యేనాటికి రెండున్నరనెలల్లోగా నిర్దేశించిన చెరువుల పనులు పూర్తి కావాలని కోరారు. వాటర్‌గ్రిడ్‌ పనులును వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే 25 వేల పోస్టుల భర్తీ చేపట్టాలని, దీనికి సంబంధించి కొద్దిరోజుల్లోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఐకెపి ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల సమస్యలను పరిష్కరించాలని, అందుకు అనుగుణంగా త్వరలో వారితో సమావేశం కావాలని సిఎం నిర్ణయించారు.

పార్టీ సంస్థాగత వ్యవహా రాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శుల మధ్య సయోధ్య లేకపోవడం, అధికారులతో సమన్వయ లోపం తదితర అంశాలపై కేసీఆర్  చర్చించారు.  శాసనమండలి పట్టభద్రుల నియోజవకర్గ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను సీఎం ప్రస్తావించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో ఎదురైన ఓటమి భవిష్యత్తులో పునరావృతం కావద్దని పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల మంత్రులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను విశ్లేషించారు. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాలని, అన్నింట్లోనూ గెలుపొందేలా ఆయా జిల్లాల మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అలాగే జీహెచ్‌ఎంసీ, వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా కేడర్‌ను బలోపేతం చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana  ministers  elections  polls  departments  ministrys  schemes  

Other Articles