Modi | RBI | Farmers

Banks will not close if you give loans to the farmers modi said

banking, rbi, farmers, lend, loan, crops, india, poor, govt, subsidy, rangarajan, modi

Prime Minister Narendra Modi on Thursday asked the banking sector to start lending to the underprivileged including poor farmers, poor students and people running small businesses so that their financial condition could improve which will ultimately contribute to India’s economic growth.

రైతులకు రుణాలిచ్చినంత మాత్రాన బ్యాంకులు దివాళా తీస్తాయా- మోదీ

Posted: 04/03/2015 09:13 AM IST
Banks will not close if you give loans to the farmers modi said

దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల స్థితిని అర్థం చేసుకుని రుణాలు మంజూరు చేయాని ప్రధాని యోడీ బ్యాంకులను కోరారు.  రైతులకు రుణాలిచ్చినంత మాత్రాన బ్యాంకులేవీ దివాలా తీయవని ఆయన స్పష్టం చేశారు. పేదలకు రుణాలు మంజూరు చేయడంలోనే కాదు వసూలు చేసుకోవడంలోనూ వారి స్థితిగతుల్ని అర్థం చేసుకుని వ్యవహరించాలని ఆయన తెలిపారు. రిజర్వ్ బ్యాంకు ఏర్పడి 80సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రైతులు సహా పేదల పరిస్థితిని అర్థం చేసుకుని అర్థవంతమైన రీతిలోనే బ్యాంకింగ్ సేవల్ని తీర్చిదిద్దే దిశగా దృష్టి సారించాలన్నారు. రుణ భారాన్ని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల భారాన్ని తీర్చలేమా అంటూ మోదీ ప్రశ్నించారు. మన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషాద ఘటనల వెనుక ఉన్న బాధ కేవలం పత్రికా కథనాలకు, టెలివిజన్ విశే్లషణలకే పరిమితం కాకూడదు. దేశానికి అన్నం పెడుతున్న రైతు ఇలా దయనీయంగా మరణిస్తే..అందుకు రుణభారమే కారణమన్న అంశంపై బ్యాంకింగ్ వ్యవస్థ చలించదా..’అని మోదీ ప్రశ్నించారు.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 2035 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి ఆర్థిక సేవలు చేరేలా తమ లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సూచించారు. ఆర్‌బీఐ 80 వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 80వ వార్షికోత్సవంలో మోడీ మాట్లాడుతూ 2035 నాటికి ఆర్‌బిఐ 100 ఏళ్లకు చేరుకోనుందన్నారు. 2035 నాటికి దేశంలోని ప్రతి కుంటుంబానికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banking  rbi  farmers  lend  loan  crops  india  poor  govt  subsidy  rangarajan  modi  

Other Articles