సినిమా ఫక్కీలో ఏకంగా ఒక కంటైనర్ ఎటక్ట్రానిక్ వస్తువులను అపహరించుకుపోయారు దొంగలు. దొంగతనాలు చేయడం పెద్ద కష్టం కాదన్నట్లుగా సినిమాల్లో చూపించడం.. ఆ సినిమాలు సక్సెస్ సాధించడం మాత్రమే మనం చూస్తుంటాం కాని.. సినిమాల్లో మాదిరిగా దొంగలు తెలివి మీరి దోంగతనాలకు తెగబడుతున్నారు. ఒక్కటి, అనేక చిత్రాలు దోంగతనం ఇతివృత్తంతోనే రావడం.. వాటి సక్సెస్ తో సీక్వెల్‌లు రావడం పరిపాటిగా మారింది. అచ్చం సినిమా పక్కీలో దేశ రాజధానిలో ఒక కంటైనర్ లారీ నిండుగా వున్న ఎలక్ట్రానిక్ వస్తువులను దోంగలు అపహరించుకుపోయారు. దాని విలువ సుమారుగా 25 కోట్ల రూపాయలు కావడంతో.. అధికారులు గోప్యంగా వుంచినా.. ఎట్టకేలకు బహిర్గతమైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ శివార్లలో ఉన్న కాళిందీకుంజ్ ప్రాంతం. తెల్లవారు జామున ఒంటిగంట సమయంలో శామ్సంగ్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగలు అటకాయించారు. ఆ కంటైనర్ తలుపులు పగలగొట్టి మరీ దాంతో పారిపోయారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడాకు ఆ కంటైనర్ వెళ్తోంది. ఆ వాహనం డ్రైవర్, క్లీనర్లు ఇద్దరినీ దొంగలు చితక్కొట్టారు. చివరకు ట్రక్కుతో సహా పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో పోలీసు బృందాలను మోహరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more