Krishna water | Disputes | The Supreme Court

Krishna water dispute at the supreme court

Krishna, water, dispute, The Supreme Court, Telangana, Andhra Pradesh, Maharashtra, Karnataka

The Supreme Court on Friday asked States like Telangana, Andhra Pradesh, Maharashtra and Karnataka to file their submissions on the Krishna water dispute within three weeks, saying the matter should be put to rest at the earliest.

'కృష్ణ'మ్మ కోసం కొట్లాట.. ఏప్రిల్ 9 కి విచారణ వాయిదా

Posted: 03/28/2015 08:56 AM IST
Krishna water dispute at the supreme court

కృష్ణానదీ జలాల వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇటు సుప్రీం కోర్టులోనూ, బ్రజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లోనూ భాగస్వామ్య రాష్ట్రాల మధ్యన వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో కృష్ణాజలాల వివాదంపై విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి మూడు వారాల్లో తమ అభిప్రాయాలు అభ్యంతరాలను తెలుపుతూ కౌంటర్లు, రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను ఆదేశించింది. అంతే కాకుండా ఈ వివరాలన్నింటిని మూడు పేజీల్లోపే పొందుపరిచి సమర్పించాలని మూడు రాష్ట్రాలకు సూచించింది. ఉమ్మడి అంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన నీటిలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీం కోర్టు అదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరాలు తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నీటి కేటాయింపుల్లో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందినీ, కొత్తరాష్ట్రం గా ఏర్పడ్డ తమ వాదనలు కూడా విని, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ వాదనపై సుప్రీం కోర్టు స్పందిస్తూ నదీజలాల వివాదం ఎక్కువ కాలం అపరిష్కృ తంగా ఉండరాదని అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచా రణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది.

జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణానది జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ 2010 డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అది పరిష్కారమయ్యే వరకూ తీర్పును భారత ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించరాదని, అమలు చేయరాదని సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడడంతో... ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం కృష్ణానది ట్రిబ్యునల్‌లో తమకు అన్యాయం జరిగిందని, తమ వాదనలు కూడా వినాలని, లేదంటే మరో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ట్రిబ్యునల్‌ తీర్పును తక్షణం గెజిట్‌లో ప్రచురించి, అమలు చేయాలంటూ కర్ణాటక, మహారాష్ట్రలు కూడా సుప్రీంను ఆశ్రయించాయి. అయితే గతంలో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కొత్తగా ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణ తరఫు న్యాయవాదులు వాదించారు. మరి ఏప్రిల్ 29న జరిగే విచారణ ఎంతో కీలకంగా మారనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Krishna  water  dispute  The Supreme Court  Telangana  Andhra Pradesh  Maharashtra  Karnataka  

Other Articles