Landreforms | Nda | Ordinence

The government is preparing to ordinence on land reforms

Landreforms, Nda, Ordinence, modi, bill, rajyasabha, president, parliament

The government is preparing to reissue or repromulgate its controversial ordinance on land reforms. The executive order, which is aimed at making it easier for businesses to acquire land from farmers, lapses on April 5.

చట్టం చెయ్యలేక ఆర్డినెన్స్.. దొడ్డిదారిలో ఎన్డీయే..?

Posted: 03/28/2015 08:47 AM IST
The government is preparing to ordinence on land reforms

రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అని తెలుగు లో ఓ సామెత ఉంది. అంటే సకల అధికారాలను కలిగిన వాడు తలిస్తే ఏమైనా సాధ్యమవుతుందని అర్థం. అయితే తాజాగా మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగదారులు వెతికే పనిలో పడింది. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు మోదీ సర్కర్ కు ప్రతిపక్షాలు చుక్కలు చూపుతున్నాయి. దాంతో తమకు కావలసిన నిర్ణయాలను అమలు చెయ్యడానికి దొడ్డి దారులు, దొంగ దారులను వెతికింది. భూసేకరణ చట్టం చెయ్యాలని ఎంతో ముమ్మరంగా ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్ కు రాజ్యసభలో ఎదురు దెబ్బ తగులుతోంది.

భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీకి సిఫారసు చేసింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటం, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో దారి లేకుండా పోయింది. డిసెంబర్ 31న జారీ చేసిన భూసేకరణల ఆర్డినెన్స్ కాలపరిమితి ఏప్రిల్ 5తో ముగియనుంది. భూసేకరణ బిల్లును తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదించింది. కానీ ఆ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒక సభను ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. అందుకే రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. అయినా లోక్ సభలో క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే పక్షం, రాజ్యసభలో మాత్రం మెజారిటీ లేకపోవడంతో భూసేకరణ బిల్లుకు అడ్డుకట్టపడింది. అయితే ఈ బిల్లుకు అన్ని పక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎన్ని సార్లు ప్రతిపక్షాలను వేడుకున్నా లాభం లేకుండా పోయింది. దాంతో ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ కు మొగ్గుచూపుతోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Landreforms  Nda  Ordinence  modi  bill  rajyasabha  president  parliament  

Other Articles