mega brother naga babu support rajendra prasad in Maa election contest

Nagababu support rajendra prasad

nagababu support rajendra prasad, nagababu on maa elections, jayasudha vs rajendra prasad, maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja

mega brother naga babu support rajendra prasad in Maa election contest

ఏకగ్రీవం నుంచి పోటీ వరకు ఎవరిదీ రాజకీయం..?: నాగబాబు

Posted: 03/25/2015 07:18 PM IST
Nagababu support rajendra prasad

మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రక్తి కట్టిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో అనేక మలుపులు తిరిగినట్టు రోజురోజుకు, గంట గంటకు పరిస్థితులు మారుతున్నాయి. సీనియర్ కమేడియన్, నటుడు రాజేంద్రప్రసాద్ కే తాను మద్దతు ఇస్తానని  చిరంజీవి సోదరుడు నాగబాబు స్పష్టం చేశారు. గెలుపోటములు దైవాదీనమని, ఫలితాల గురించి తాము ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. రాజేంద్రప్రసాద్ మనస్తత్వం, అనుభవం చూసే తనకు మద్దతు ఇచ్చానని అన్నారు.

ఈ సారి ఎన్నికలలో పాతవాళ్లందరూ తప్పుకుని కొత్తవాళ్లకు అవకాశమిద్దామని మురళీ మోహన్ చెప్పారని వెల్లడించారు. తామంతా రాజేంద్రప్రసాద్ ను అధ్యక్ష పదవికి ప్రతిపాదించామని, ఆయన పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అనుకున్నామని చెప్పారు. అయితే తర్వాత జయసుధ పేరును తెరపైకి తెచ్చారని వాపోయారు. ఏకగ్రీవం నుంచి పోటీ వరకు ఎవరు రాజకీయం నెరిపారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందన్నారు. అసోసియేషన్ ను ప్రశ్నిస్తే బెదిరింపులుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ కు మద్దతు ఇవ్వొద్దని, అతనికి అంత స్టేచర్ లేదని మురళీమోహన్ తనతో అన్నారని నాగబాబు తెలిపారు. రాజేంద్రప్రసాద్ అనుభవంపై తమకు నమ్మకముందన్నారు. మార్పు కోసం ఒక్కరు చాలని, రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలని కోరారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad pannel  jayasudha pannel  maa president elections  naga babu  

Other Articles