Ttdp leader yamini bala fire on nagari mla roja for her statements and actions at assembly

roja, ysrcp, yamini bala, dushassana parva, nagari mla, cactor roja

ttdp leader yamini bala fire on nagari mla roja for her statements and actions at assembly. yamini bala fire on roja, she said that roja tyrying to produce dushasena parva in ap assembly.

హవ్వ.. చీర లాగించుకోవాలని చూస్తోందట..!

Posted: 03/24/2015 08:43 AM IST
Ttdp leader yamini bala fire on nagari mla roja for her statements and actions at assembly

ఏపి అసెంబ్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి. రోజా చేసిన యాక్షన్ కి మా రియాక్షన్ అన్నట్లు టిడిపి నేతలు రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. విప్‌ యామినీబాల అయితే ఇంకో అడుగు ముందుకేసి మరీ రోజా గురించి కాస్త ఘాటుగా మాట్లాడారు. రోజా అసెంబ్లీలో దుశ్శాసన పర్వానికి తెర తీయాలన్న ఆలోచనలో ఉన్నారని, ఆమె ఎంత రెచ్చగొట్టినా టీడీపీ సభ్యులు హద్దుమీరబోరని ఆమె స్పష్టం చేశారు.  ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఆమె చీర లాగించుకోవాలనుకొంటోంది. మాది శ్రీకృష్ణ జాతి. ఆమె చీర ఎవరైనా లాగితే అడ్డుకుంటామని యామిని బాల తెలిపారు. అంతే కాదు రోజా ను తిగుతూనే పనిలో పనిగా తమ నాయకుడుని ఆకాశానికి ఎత్తేశారు.  మా నాయకుడు చంద్రబాబు మహిళా పక్షపాతి అని ఆమె వ్యాఖ్యానించారు.

నోరు, చేతులే అనుకున్నాం... ఏకంగా అసెంబ్లీలోనే ఆమె కాలెత్తుతున్నారు. అయినా జగన్మోహన్‌ రెడ్డి కనీసం వారించడంలేదు. మా సభ్యులెవరైనా చిన్న మాట జారితే మా నాయకుడు చంద్రబాబు వెంటనే వారివైపు చూస్తున్నారని యామిని బాల తెలిపారు. చంద్రబాబు మాకు హద్దులు దాటొద్దు అనే చూపులతోనే హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. దళితులపై మరోసారి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే రోజా నోరు చీరేస్తామని హెచ్చరించారు. మరి ఇంతకీ దుశ్శాసనుడు ఎవరో, శ్రీకృష్ణుడు ఎవరో చెప్పి ఉంటే కూడా బాగుండేదని అప్పుడే చలోక్తులు కూడా విసురుతున్నారు కొందరు. అయినా సభ అంటే పాత కాలం నాటి సభ కాదని ప్రజాప్రతినిధులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను మరిచినపోవద్దని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఏపిలో కనీసం ఇక మీదటైనా వివాదాలకు దూరంగా అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడుస్తాయో లేదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roja  ysrcp  yamini bala  dushassana parva  nagari mla  cactor roja  

Other Articles