Du plesis and de velliers getting big score for the sot uthafrica while the semis in world cup 2015 season

du plesis, de velliers, south africa, newzeland, world cup,

du plesis and de velliers getting big score for the sot\uthafrica while the semis in world cup 2015 season. du plesis and de velliers performing excellent preformence in the semi final match with the newzeland.

ఆ ఇద్దరు కలిశారంటే సఫారీల సవారే...

Posted: 03/24/2015 09:27 AM IST
Du plesis and de velliers getting big score for the sot uthafrica while the semis in world cup 2015 season

డు ప్లిసిస్, డి విలియర్స్ ఇద్దరూ సౌతాప్రికా జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాళ్లు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్స్ లో సఫారీ జట్టుకు ఆపద్భాందవుల్లా మారారు. ఓపెనర్లు తక్కువ స్కోర్ వద్దే వెనుదిరిగినా జట్టు బాధ్యతలను భుజాలపై మోస్తు, విజయతీరాలకు చేర్చాలని డు ప్లిసిస్, డి విలియర్స్ ఇద్దరూ ఎంతో తపన పడుతున్నారు. మొదట్లో న్యూజిలాండ్ కట్టుదిట్టమైన బాలింగ్, పర్ఫెక్ట్ బౌలింగ్ తో బెంబేలెత్తిన సౌతాఫ్రికా జట్టు ప్లిసిస్ వచ్చాక కాస్త నిలకడగా ఆడుతోంది. బంతులను కాస్త ఎక్కువగా వాడుకున్నా, జట్టుకు నైతిక బలాన్ని చేకూర్చారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడి, తరువాత దూకుడు పెంచిన ప్లిసిస నెమ్మదిగా 50 పరుగుల మార్క్ ను దాటాడు. 6 ఫోర్లు, ఓ సిక్సుతో 99 పరుగుల్లో 73 పరుగులు చేశాడు ప్లీసిస్.

ఇక లేట్ గా వచ్చినా బ్యాంటిగ్ లో తడాకా చూపిస్తున్నాడు డి వెలియర్స్. తమ జట్టును ఎవ్వరూ ఆపలేరని స్టేట్ మెంట్ ఇచ్చిన డె విలియర్స్ మాటల్లోనే కాదు బ్యాంట్ తోనూ సమాధానం చెడుతున్నాడు. తమ బ్యాట్స్ మన్లను ముప్పు తిప్పలు పెడుతున్న న్యూజిలాండ్ బాలర్లకు చుక్కలు చూపుతున్నాడు డె విలియర్స్. 34 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్ తో 53 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టు అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా చూస్తున్నాడు. 30 ఓవర్ల దాకా నిదానంగా ఆడిన సౌతాఫ్రికా బ్యాట్స్ మాన్స్ 30 ఓవర్ల తరువాత చెలరేగి ఆడారు. 31 ఓవర్ నుండి 33 ఓవర్ల వరకు 11 పరుగులతో స్కోర్ ను భారీ పెంచేశారు. డి విలియర్స్, ప్లీసిస్ పార్ట్ నర్ ఫిప్ ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. 34 వ ఓవర్లో అయితే 13 పరుగులు, 36వ ఓవర్లో భీభత్సంగా 15 పరుగులతో చలరేగి ఆడారు. ప్రారంభంలో కనీసం 200 పరుగుల మార్క్ వరకు చేరుకుంటుందా అని అనుమానించిన వారు కూడా ఇలా రెచ్చిపోతే 300 పరుగుల మార్క్ ను దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి సెమీ ఫైనల్స్ అంటే ఇలానే ఉండాలి అన్నంత రంజుగా సాగుతోంది న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్. మరి ఇంత రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్ లో విజయం ఎవరిదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : du plesis  de velliers  south africa  newzeland  world cup  

Other Articles