Ap cm chandrababu naidu on farmers at assembly

ap, cm, chandrababu, farmers, crops, loans, rbi, croploan

ap cm chandrababu naidu on farmers at assembly. in the ap assembly sessions chandrababu clear his and his govt vision on farmers. he said that ap govt will clear all crop loans of farmers.

బాబు నోట రైతుల మాట.. వేస్తా బంగారు బాట

Posted: 03/23/2015 01:51 PM IST
Ap cm chandrababu naidu on farmers at assembly

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  వ్యవసాయాన్ని లాభాసాటిగా మారుస్తామని, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కెటింగ్‌లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తామని ఇందుకోసం ఇక్రిశాట్‌, నాబార్డ్‌ సహకారం తీసుకుంటామని వెల్లడించారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రుణమాఫీ విషయంలో ఆర్‌బీఐ సమస్యలు సృష్టించిందని అయిన్నప్పటికీ రైతు రుణమాఫీ చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కోటయ్య కమిటీ సూచనలకు అనుగుణంగానే రుణమాఫీ జరుగుతుందన్నారు. రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీతో 98 శాతం మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. పంటల భీమా కోసం రూ.600 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
 
రైతులకు అన్నివిధాలుగా ఏపి ప్రభుత్వం అండగా ఉంటుందని  ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆధార్‌, రేషన్‌, ఓటర్‌ ఐడీ కార్డు ఆధారంగా రైతుల కుటుంబాలను లెక్కించినట్లు ఆయన తెలిపారు. 50 వేల లోపు రుణాలు తీసుకుంటే ఒకేసారి మాఫీ జరుగుతుందని, 50వేల పైన రుణాలు తీసుకున్న వారికి దశలవారిగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఉద్యానవన పంటలకు ఎకరాకు 10 వేల చొప్పున మాఫీ చేస్తామని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రుణమాఫీ గురించి ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను చంద్రబాబు తిప్పికొట్టారు. జగన్ మాటల వరకే కానీ చేతలు సాధ్యం కాదు అని అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  cm  chandrababu  farmers  crops  loans  rbi  croploan  

Other Articles