Nara nandamuri families got special gift on the occasion of ugadi

ugadi, nandamuri, nara, chandrababu, chandrababu, nara lokesh, brahmani

nara, nandamuri families got special gift on the occasion of ugadi. cinema hero, hindupur mla balakrishna, ap cm chandrababu naidu become grand parents. nara lokesh wife bhahmani gave birth to boy baby on ugadi

నారా, నందమూరి వారింట ఉగాది 'స్పెషల్'

Posted: 03/21/2015 05:29 PM IST
Nara nandamuri families got special gift on the occasion of ugadi

ఉగాది పండగ అందరికి సంతోషాలు తీసుకువస్తుంది. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ హీరో బాలకృష్ణకు మాత్రం డబుల్ ధమాకాను తీసుకువచ్చింది ఈ ఉగాది. ఒకేసారి నందమూరి, నారా కుటుంబాల్లో సంతోషాలను తీసుకువచ్చింది ఈ ఉగాది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని అందరు అన్నట్లు, ఒకే రోజు పండగ ఓ వైపు, మరో వైపు మాంచి తీపి కబురు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

ఉగాది పండుగ నందమూరి.. నారా కుటుంబాలకు కొత్త సంబరాలు తెచ్చింది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఇటు నారా వారు, అటు నందమూరి వారింట ఆనందం వెల్లివిరిసింది. ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఏకైక కుమారుడు లోకేష్కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఉగాది రోజునే వారికి మగబిడ్డ పుట్టడంతో.. రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపు అయ్యింది. నందమూరి, నారా వారి అభిమానులు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ugadi  nandamuri  nara  chandrababu  chandrababu  nara lokesh  brahmani  

Other Articles