Virat kohli tweeted about her love at nh10 cinema

anushka, viratkohli, tweet, love, star batsman, kohli, nh10

virat kohli tweeted about her love at nh10 cinema. virat kohli appriciate the excellent performence of anushka in latest film nh10. he tweet that 'Just watched NH10 and i am blown away. What a brilliant film and specially an outstanding performance by my love AnushkaSharma

నా లవ్ అదరగొట్టింది: విరాట్ కోహ్లీ ట్వీట్

Posted: 03/18/2015 09:31 AM IST
Virat kohli tweeted about her love at nh10 cinema

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో తన ప్రేమాయణాన్ని పత్రికలో ప్రచురించినందుకు  మీడియా ప్రతినిధిపై చిర్రుబుర్రులాడిన  స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు తన ప్రేయసి గురించి తానే ట్విట్టర్లో ప్రస్తావించాడు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తాడు.  అనుష్క శర్మ నటించిన థ్రిల్లర్ మూవీ ఎన్‌హెచ్ 10 ఇటీవలే విడుదలైందిగా. ఆ సినిమాను కోహ్లీ మంగళవారం చూశాడట. ఈ సినిమాలో అనుష్క నటనను చూసి కోహ్లీ ముగ్ధుడయ్యాడట. ఇప్పుడే ఎన్‌హెచ్10 చూశా. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా నా ప్రేయసి అనుష్క శర్మ నటన అద్భుతం. చాలా గర్వంగా ఉంది అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

నిన్నటి దాకా గుట్టు చప్పుడు కాకుండా విరాట్, అనుష్క ల మధ్య సాగుతున్న ప్రేమాయణాన్ని మీడియా కాస్తా హైలెట్ చేసింది. రోజుకో వార్తతో కోహ్లీ లవ్ స్టోరీని రచ్చ చేసింది. మ్యాచ్ లో అనుష్కను చూస్తూ గాలిలో ప్లయింగ్ కిస్ లు విసురుతూ అనుష్కను కవ్వించిన విరాట్ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించడం అందటా చర్చనీమయాంశంగా మారింది. ప్రేమలో మునిగిన అనుష్క తన కెరీర్ పై దృష్టి సారించలేకపోతోందని అని కొందరు చేసిన విమర్శలకు ధీటుగా సినిమాలో అదగొట్టింది. అయితే ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రశంసించినా విరాట్ కోహ్లీ ట్వీట్ అనుష్కకు పెద్ద ప్రశంసే. నిన్నటి దాకా మీడియా కెక్కిన విరాట్ కోహ్లీ, అనుష్క ల ప్రేమాయణం ఇప్పుడు ట్విట్టరెక్కింది.. మరి ఇంకా ఎక్కడిదాకా వెళుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  viratkohli  tweet  love  star batsman  kohli  nh10  

Other Articles