Tdp mlas complaint to speaker on ysrcp mla rojas photo

roja, actor roja, ysrcp, tdp, ysrcp mla roja, assembly, speaker

tdp mlas complaint to speaker on ysrcp mla rojas photo. ap telugudesam party leaders attacked on ysr mla, actor roja for photo at assembly. they complined to assembly speaker.

రోజా 'ఆ ఫోటో' పై గుర్రుగా ఉన్న టిడిపి

Posted: 03/18/2015 10:14 AM IST
Tdp mlas complaint to speaker on ysrcp mla rojas photo

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, నటి రోజా దిగిన ఫోటోపై తెలుగుదేశ: పార్టీ నేతలు మండిపడుతున్నారు. సభా హక్కలను ఉల్లంఘిస్తు రోజా ఇలాంటి పని చెయ్యడం ఏంటని ఏకంగా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అదేంటి ఓ ఫోటో దిగితే దానికి టిడిపి వారికెందుకు కోపం అనుకుంటున్నారా.. ఫోటో దిగడం గురించి కాదు.. ఫోటో తీసిన ప్రాంతం గురించి టిడిపి ఆందోళన. సభ సమయం ముగిసిన తర్వాత రోజా అసెంబ్లీలో శాసనసభ్యులు కాకుండా బయటి వ్యక్తులతో ఫోటో దిగారట. దీనిపై ఇప్పుడు టీడీపీ గుర్రుగా ఉంది.

అసెంబ్లీలో బయటి వ్యక్తులతో ఫోటో దిగడం ద్వారా రోజా శాసనసభను అగౌరవపరిచారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈమేరకు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు  సభా హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్ కోడెల శివస్రపాద్ కు ఫిర్యాదు చేసింది. అసలే రోజా ఈ మధ్య చంద్రబాబుపై దుమ్మెత్తి పోసింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రోజా దిగిన ఫోటో విమర్శలకు దొరికిన మంచి అవకాశంగా భావిస్తోంది.. అందుకే రోజా పై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. మరి స్పీకర్ పోనీలే పాపం అని వదిలేస్తారో లేదా ఏవైనా చర్యలు తీసుకుంటారో చూడాలి. మొత్తానికి స్పీకర్  ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roja  actor roja  ysrcp  tdp  ysrcp mla roja  assembly  speaker  

Other Articles