Maharastra tops in crime on woman beats delhi

maharastra tops in crime on woman, maharastra beats nation capital Delhi in crime rate, Violence against women, Union minister of women and child development Maneka Gandhi, Violence against women in india, rape on women, sexual assault on woman, insult to modesty on woman, kidnapping woman, abduction of woman, cruelty by intimate partner or relatives on woman, trafficking of woman, persecution for dowry, woman dowry deaths, indecency towards woman, Rape most common crimes against women, crime on woman,

Maharashtra last year achieved the dubious distinction of recording the most number of cases of rape and assault on women among all Indian states.

మహా, మధ్య తరువాత తెలుగు రాష్ట్రాలకే అప్రతిష్ట..!

Posted: 03/16/2015 05:36 PM IST
Maharastra tops in crime on woman beats delhi

దేశ రాజధాని ఢిల్లీ రికార్డులను దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరమున్న మహారాష్ట్రం బద్దలు కోట్టింది. అయితే ఈ రికార్డులు ఎంతో కొంత ఖ్యాతిని తెచ్చిపెట్టేవి కావు.  రాష్ట్రంతో పాటు ఆ రాష్ట్ర ప్రజలను కూడా అపఖ్యాతి పాలు చేసేవి. మహిళలపై లైంగికదాడులు, వేధింపుల్లో మహారాష్ట్ర దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాలన్నింటి కంటే ముందువరుసలో నిలిచి సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి కొనితెచ్చుకుంది. గత ఏడాది ఆ రాష్ట్రంలో 13,827 లైంగికదాడి, వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కూడా కావాల్సినంత అప్రతిష్ఠను మూటగట్టుకున్నాయి.

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన వివరాలను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. దేశవ్యాప్తంగా మహిళలపై  1,17,035 వేధింపులు, అత్యాచారాల కేసులు నమోదు కాగా వాటిలో మహారాష్ట్ర ముందు వరుసలో నిలిచింది. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (13,323), అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (13,267) రాష్ట్రాలున్నాయి. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మేనకా గాంధీ వివరించారు. అందరూ మహిళలే ఉండే మహిళా పోలీస్ స్టేషన్లు మహారాష్ట్రలో ఇంకా ప్రారంభం కాలేదని, మహిళల ఫిర్యాదులు స్వీకరించేందుకు మహిళా సిబ్బందిని నియమించాలని, దాంతోపాటు మహిళా అధికారుల సంఖ్యనూ పెంచాల్సిన అవసం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crime on woman  maharastra  madhyapradesh  andhrapradesh  

Other Articles