Rati agnihotri files domestic violence case against her husband

yester years actress rati agnihotri, rati agnihotri files domestic violence case, rati agnihotri husband Anil virvani, mental and physical harrasment, Rati Agnihotri accuses husband of assault, Bollywood actress Rati Agnihotri, Rati Agnihotri Files Domestic Violence Complaint Against Husband, Rati Agnihotri Files Complaint Against Husband,

yester years actress rati agnihotri files domestic violence case against her husband Anil virvani

బాలీవుడ్ నటికీ.. తప్పని వేదింపులు..

Posted: 03/15/2015 01:19 PM IST
Rati agnihotri files domestic violence case against her husband

బాలీవుడ్ నిన్న టితరం నటి రతి అగ్నిహోత్రికి గృహ హింసలు తప్పలేదు. దీంతో ఇన్నాళ్ల సంసార జీవితం తరువాత అమె తన భర్త అనిల్ వీర్వాణీపై ముంబాయి పోలిస్ స్టేషన్ లో కేసు సెట్టారు. తన భర్త తనను మానసికంగా, శారీరికంగా వేధిస్తున్నారని పేర్కొంటూ గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు. తన భర్త అడగాలను చాలా కాలంగా భరిస్తున్నానని, ఇక వాటిని భరించడం తనతో కాదని నటి తన ఫిర్యాదులో పేర్కోంది. తనను హింసించడంతో పాటు చంపుతానంటూ బెదిరించారని అమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రతి నుంచి తమకు అందిన ఫిర్యాదు మేరకు అనిల్‌పై  కేసు నమోదు చేసినట్లు స్థానిక డీసీపీ జయకుమార్ వెల్లడించారు. చేతులపై గాయాల గుర్తులను చూపుతూ రతి మార్చి 7న మౌఖికంగానూ ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. వ్యాపారంలో ఇబ్బందుల వల్ల ఆమె భర్త సహనం కోల్పోవడం కూడా హింసకు ఒక కారణమై ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నాయి. ముందుగా వారిద్దరితో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు యత్నిస్తామని, అప్పటికీ వినని పక్షంలో నటి ఫిర్యాదు మేరకు కేను సమోదు చేసి చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rati Agnihotri  Anil virvani  domestic violence  

Other Articles