Telanagana cm kcr announce that there will be no dsc

kcr, telangana, dsc, teachers, tet,

telanagana cm kcr announce that there will be no dsc. in nizamabad telanagana cm kcr clear that no dsc forther. may tachers recruirement will be done by telanagana public commission.

ఇక డిఎస్సీ ఉండదు.. టిపిఎస్సీ ద్వారా నియామకాలు

Posted: 03/13/2015 10:57 AM IST
Telanagana cm kcr announce that there will be no dsc

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సీ నిర్వహిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలపై ముఖ్యమంత్రి కెసిఆర్ నీళ్లుజల్లారు. ఇకపై డిఎస్సీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సిఎం ప్రకటనతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వల్లెవేస్తూనే, ఇకపై డిఎస్సీ ఉండబోదని సిఎం చేసిన ఏక వాక్య ప్రకటనతో సభాప్రాంగణంలో ఉన్న అనేకమంది ఖంగుతిన్నారు. దాదాపు మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. సమైఖ్య రాష్ట్రంలో వారి ఆశలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కెసిఆర్, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు టెట్‌ను కూడా పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేయడం జరిగింది.

టెట్ లేకుండానే డిఎస్సీ నిర్వహిస్తామన్న కెసిఆర్ ప్రకటనతో, టెట్‌కు అర్హత సాధించని బిఇడి, టిటిసి అభ్యర్థులు కూడా సంబర పడ్డారు. వారు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సీని ప్రకటించడంతో తెలంగాణ సర్కార్ కూడా కొంత ఆలస్యంగానైనా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తుందని గంపెడాశతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.  వేలాదిమంది పెద్దఎత్తున ఫీజులు చెల్లిస్తూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇక డిఎస్సీ ఉండబోదని ముఖ్యమంత్రి విస్పష్టంగా తేల్చి చెప్పడంతో ఉపాధ్యాయ నియామకాలు ఏ పద్ధతిలో చేపడతారన్న దానిపై అభ్యర్థుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సీ స్థానంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే పరీక్ష నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీని విషయమై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుందని చెబుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kcr  telangana  dsc  teachers  tet  

Other Articles