Bangladesh put 289 runs target to new zealand

newzealand versus bangladesh, newzealand vs bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, newzealand, newzealand CWC 2015, Live Scores, Live Updates, bangladesh, bangladesh CWC 2015, Sports, World Cup Live

Mahamoodullah century helps bangladesh to put 289 runs target to new zealand

న్యూజీలాండ్ ఎదుట 289 పరుగుల విజయలక్ష్యం..

Posted: 03/13/2015 11:54 AM IST
Bangladesh put 289 runs target to new zealand

ప్రపంచ కప్ టార్నమెంటులో భాగంగా గ్రూప్ ఏలో హామిల్టన్ వేదికగా న్యూజీలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్లు 289 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థులకు నిర్ధేశించారు. బంగ్గాదేశ్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా రికార్డు సెంచరీ సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లా 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. అయితే బంగ్లా బ్యాట్స్ మెన్లలో మంచి ఫామ్ లో వున్న మహ్మూదుల్లా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. దీనికి తోడు వరుసగా వరల్డ్ కప్ లో రెండో సెంచరీ సాధించిన బంగ్లా ఆటగాడిగా రికార్డు కూడా నెలకోల్పాడు.

గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 103 పరుగులు చేసిన మహ్మదుల్లా.. శుక్రవారం న్యూజిలాండ్ తో మ్యాచ్ లోనూ చెలరేగిపోయాడు. 123 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  స్లాగ్ ఓవర్స్ లో కివీ బౌలర్లపై విరుచుకు పడటంతో బంగ్లా 288 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. సౌమ్య సర్కార్ 51, షబ్బీర్ రహమాన్ 40 పరుగులతో రాణించారు. కివీ బౌలర్లలో బౌల్ట్, అండర్సన్, ఎలియాట్ రెండేసి వికెట్లు తీయగా, వెటోరీకి ఒక వికెట్ దక్కింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  newzealand  bangladesh  

Other Articles