Rs 3 000 crore to ap soon jaitley tells cm

Special Package to AP, Jaitley Spoke to Chandra Babu, YSRCP YS Jagan MohanReddy, Pawan Kalyan in AP politics, Pawan Kalyan on Modi, 3000 Crore to AP, Jaitley Assures Chandra Babu, YSRCP criticism on Central Budget to AP, Revenue Deficit in AP

Facing too much pressure from ally TDP, Finance Minister assured 3000 crore more to AP before March 31 this year. He also told additional grants for the capital city.

నవ్యాంధ్ర రాష్ట్రానికి రూ. 3 వేల కోట్లు.. భరోసా ఇచ్చిన కేంద్రం

Posted: 03/11/2015 03:59 PM IST
Rs 3 000 crore to ap soon jaitley tells cm

రాజధాని లేని రాష్ట్రాన్ని అదుకునేందుక కేంద్రం ముందుకోచ్చింది. కేంద్ర బడ్జెట్ లో తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని గత కొంత కాలంగా ఏకరుపు పెడుతున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ మేరకు కేంద్రంతో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ కు 3 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామి లభించింది.
 
ఈ మేరకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో సంభాషించినట్లు సమాచారం వెయ్యి కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణంలో కోసం కేటాయించనుండగా, మరో వెయ్యి కోట్ల రూపాయలను జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్రబడ్జెట్ లో పోలవరం నిర్మాణానికి కేటాయించిన 100 కోట్ల రూపాయలకు అదనంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. మరో వెయ్యి కోట్లను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం కేటాయించనున్నట్లు సమాచారం. కాగా ఈ మొత్తం నిధులను ఈ నెల 31 లోపే కేటాయిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్టీ.. చంద్రబాబుకు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసం మరిన్ని నిధులను విధిల్చేందుకు కూడా కేంద్రం సిద్దంగా వుందన్నారు. రాజధాని నిర్మాణంపై వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను పరిశీలించిన మీదట తాము ఆంధ్రప్రదేశ్  రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులను కేటాయిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన హేతుబద్దంగా కాకుండా ఇష్టానుసారం విభజించి.. కాంగ్రెస్ మోసంగించిందని, అదే సమయంలో కేంద్ర నిధులపై గంపెడాశ పెట్టుకున్నా.. కేంద్రం కనుకరించకపోవడం.. శోచనీయమని, చంద్రబాబు కేంద్రంపై పరోక్ష విమర్శలు చేసిన రోజునే కేంద్రం సానుకూలంగా స్పందించడం గమనార్హం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 3000 Crore to AP  Jaitley Assures Chandra Babu  YSRCP  Revenue Deficit in AP  

Other Articles