Ktr warned to dk aruna on dadagiri at assembly

dk aruna, ktr, kcr, cabinet, ravinderreddy, question hour, anger, telanagana, dadagiri

ktr warned to dk aruna on dadagiri at assembly. dk aruna attacks on telanagana govt that, even no one member in the cabinet. ktr discribe that the cabinet has some issues on that.

మీ దాదాగిరీ చెల్లదు: మంత్రి కెటిఆర్ హెచ్చరిక

Posted: 03/10/2015 10:59 AM IST
Ktr warned to dk aruna on dadagiri at assembly

కాంగ్రెస్ మాజీ మంత్రి డి.కె అరుణ పై కెటిఆర్ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అంశాలను మాట్లాడేపుడు డికె అరుణ మంత్రిని అడ్డగించే ప్రయత్నం చేసింది. అయితే విద్యా సాగర్ రావు, రవీందర్ రెడ్డి లు డికె అరుణ ప్రసంగానికి అడ్డుగలిగారు. దాంతో కోపంతో మీ మంత్రి మండలిలో మహిళలకు తగిన గౌరవం ఇవ్వడం లేదు, కానీ సభలో కూడా మీరు మహిళల పట్ల గౌరవాన్ని పాటించకపోతే ఎలా అంటూ డికె అరుణ మండిపడింది. డికె అరుణ మాటలను మంత్రి కెటిఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో దాదాగిరీ చెయ్యాలనుకుంటే కుదరదని హెచ్చరించారు. మీరు చేసిన నిర్వాకం గురించి అందరికి తెలుసు అని అన్నారు. మంత్రి మండలిలో కొన్న కారణాల వల్ల మాత్రమే మహిళలకు చోటు కల్పించలేదని, అంతేకానీ కాంగ్రెస్ లా మహిళా మంత్రులను జైలుకు పంపే అలవాటు తమకు లేదంటూ ఎద్దేవా చేశారు.

మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రవర్తించిన తీరు మహిళా లోకానికే సిగ్గు చేటని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తనపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ డి.కె.అరుణ,తదితర సభ్యులు ఆందోళనకు దిగినప్పుడు కడియం ఈ వ్యాఖ్య చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో అరుణ ఎలా మాట్లాడారో చూడాలని, అది చూస్తే ఆమె క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మొత్తానికి డి.కె అరుణ వ్యవహారం తెలంగాణ అసెంబ్లీలో వేడిపుట్టించింది. తరువాత కొంత సమయానికి సభ సజావుగా నడిచింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dk aruna  ktr  kcr  cabinet  ravinderreddy  question hour  anger  telanagana  dadagiri  

Other Articles