Avinash who brutly harasing innocent people police file a case

avinash, chaeting, chinarahappa, police case, ap, kakinada,

avinash who butly harasing innocent people, police file a case. a cheater who chaeting many members knowning as ap home minister nimmakayala chinarajappa relative. but minister clear that ha is not his relative.

హోంమంత్రి బంధువునంటూ మోసాలు.. అవినాష్ పై కేసు నమోదు

Posted: 03/10/2015 10:11 AM IST
Avinash who brutly harasing innocent people police file a case

హోంమంత్రి చినరాజప్ప బంధువునని, ఉద్యోగాలు,పదవులు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి ఒక మోసగాడు లక్షల్లో దోచుకున్నాడు. పలు విద్యా సంస్థలు, ఎన్జీవోల దగ్గర నుండి అందినంతా దోచుకున్నాడు ఆ ప్రభుద్దుడు. అతని బండారం బయటపడటంతో  అతన్ని నిలదీసిన బాధితుల్ని హాకీ స్టిక్కుతో ఇష్టమొచ్చినట్టుగా చితకబాదాడు. విషయం పోలీసుల దృష్టికి రాగా విచారించి ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ నిందితుణ్ణి విడిచిపెట్టేశారు.

ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఓ సంస్థ పేరుతో మానవ హక్కుల సంఘం తరఫున దక్షిణ బారతదేశానికి చైర్మెన్ అంటూ హల్ చల్ చేస్తున్నాడు. అప్పారావు రోడ్‌లో మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని కూడా తెరిచాడు. సఫారీ కారు, గన్ మెన్లను పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డాడు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం పేరుతో ఐక్యరాజ్యసమితి బార్ అపోసియేషన్ అనుబంధ సంస్థగాను, సెమి ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటూ మభ్యపెట్టి వసూళ్లకు పాల్పడ్డాడు. రాజమండ్రిలో ఓ దళిత కుటుంబాన్ని ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ దృశ్యాలను వీడియో తీసి వసూళ్లకు వాడుకున్నాడు. కాకినాడలో ఉంటే ఓ మహిళ నుండి 14 లక్షలు తీసుకున్న అవినాష్ పై బాధితురాలు ఫిర్యాదు చేశారు.

ఖరీదైన కారు, ఆ కారుకు ఎర్రబుగ్గ, ఆ కారుపై ‘అవినాష్ ఛైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్‌బోర్డు ఏర్పాటుచేసి తిరుగుతూ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఆరోపణలు రావడంతో ఫిబ్రవరి 27న పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజకీయపరమైన ఒత్తిళ్లతో వదిలేశారు. ఆగడాలు కొనసాగించిన అవినాష్ నిలదీసిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ఓ దళిత కుటుంబాన్ని కూడా ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. తనను ప్రశ్నిస్తే మీకూ ఇదే గతి పడుతుందని పలువురి బాధితులకు ఆ వీడియో పంపి హెచ్చరించాడు. బాధితుల్లో ఒకరు సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అవినాష్ ఆగడాలు బయటకు పొక్కినట్లు కూడా కథనం ప్రచారంలో ఉంది. ఇవే వీడియో క్లిప్లింగులను పలు టీవీ చానె ళ్లు సోమవారం రోజంతా  ప్రసారం చేశాయి.  దీనిపై స్పందించిన హోంమంత్రి చినరాజప్ప ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొంటూ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు.ఆరు బృందాలు అవినాష్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.(pics from eenadu.net)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : avinash  chaeting  chinarahappa  police case  ap  kakinada  

Other Articles