Tpcc president fire on kcr family

telanagana, kcr, harishrao, ktr, uttamkumat, tpcc, trs, congress, soniagandhi,

tpcc president fire on kcr family: kcr and his family getting benefits rom telanagana new tpcc president said. the congress only battle for telangana state, then no other party like trs didnt fight anymore. congress president sonia gandhi grant telanagana.

తెలంగాణలో కుటుంబ పాలన: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted: 03/09/2015 01:06 PM IST
Tpcc president fire on kcr family

తెలంగాణ రాష్ట్రంలో అధికార పెత్తనమంతా కేసీఆర్‌ కుటుంబానిదే అంటు తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నిజానికి తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్‌కు రూపాయి భాగస్వామ్యం కూడా లేదు. లోక్‌సభలో విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్‌ సభలో లేడు. రాజ్యసభలో వారికి ప్రాతినిధ్యమే లేదు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని ఆయన వివరించారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని ధర్నాలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు. కానీ, అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ను నాశనం చేయాలని, క్షేత్రస్థాయిలో దెబ్బ తీయాలని టీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకి చెందిన వారిని బెదిరిస్తూ,  లేదంటే డబ్బులతో ప్రలోభ పెడుతూ తెరాస పార్టీలోకి చేర్చుకుంటోందని అన్నారు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్‌ సిగ్గులేకుండా వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

 తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని రెండు కోట్ల మంది మహిళల్లో మంత్రి పదవి చేపట్టడానికి ఒక్కరు కూడా సమర్థురాలు దొరకలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో 15 శాతం వరకూ ఉన్న ఎస్సీల్లోని మదిగ, మాల కులస్తుల్లో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని తప్పుబట్టారు. నిజానికి కాంగ్రెస్‌ వల్లే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఏ ఒక్క కులానికి పెత్తనం ఉండదు. టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీల్లో ఒక్క కుటుంబానిది, ఒక్క కులానిదే పెత్తనమంతా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్నాడు. రాష్ట్రంలో 50-60 లక్షల మంది దళితులు ఉంటే కేవలం 45 మందికే గోల్కొండ కోటలో పట్టాలు ఇచ్చాడు. గిరిజన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు గిరిజనులకు కూడా మూడెకరాల భూమి ఇస్తామన్నాడు. కానీ.. ఆ ఊసే లేదు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్నాడు. గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పించారని కెసిఆర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  kcr  harishrao  ktr  uttamkumat  tpcc  trs  congress  soniagandhi  

Other Articles