Final judgment on satyam will be on april 9

satyam, ranalingaraju, sharemarket, court, judgment

special court in Hyderabad trying the multi-crore accounting fraud in erstwhile Satyam Computer Services Limited (SCSL) on Monday said it will pronounce its judgement in the CBI-probed case on April 9.

సత్యం తీర్పు ఏప్రిల్ 9 కి వాయిదా

Posted: 03/09/2015 01:02 PM IST
Final judgment on satyam will be on april 9

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో తీర్పు మరోసారి వాయిదా పడింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తుది తీర్పు మళ్లీ వాయిదా పడటంతో ఎంతో మంది నిరాశ చెందారు. తుది తీర్పును న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ  పూర్తయినా, తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది.  గత సంవత్సరం డిసెంబర్ 23 తుది తీర్పు వెలువరించాల్సి ఉండాల్సింది. కానీ కేసు గురించిమరిన్ని విషయాలను అధ్యయనం చెయ్యాలని  మార్చి 9 కి వాయిదా పడింది.

కంపెనీ వాస్తవ ఆదాయాన్ని అధికంగా చూపి షేరు ధరను  భారీగా పెంచేసి అందరికీ ఝలక్ ఇచ్చింది సత్యం కంప్యూటర్స్. అప్పటి సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు, షేర్ మార్కెట్‌ను భారీగా మోసం చేసి, షేర్ హోల్డర్లకు భారీ నష్టాన్ని కలిగించారు. 2009 జనవరి 7న సత్యం కుభకోణం వెలుగులోకి  రావడంతో కంపెనీ షేరు భారీగా పడిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సంస్థ మాజీ సీఎఫ్‌ఓ శ్రీనివాస్ వడ్లమాని, పీడబ్ల్యూసీ ఆడిటర్లు ఎస్.గోపాలకృష్ణన్, టి.శ్రీనివాస్ సహా రామలింగరాజు మరో సోదరుడు సూర్యనారాయణరాజు,లతో పాటు పలువురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. సత్యం కేసును తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ దీని ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క కేసు విచారణ కోసం 2010లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. సత్యం కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది.
 - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam  ranalingaraju  sharemarket  court  judgment  

Other Articles